రాష్ట్రీయం

దీక్ష విరమించిన ఏపి స్థానికత ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ విద్యుత్ సంస్ధల నుంచి రిలీవ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యలకు ఈ నెల 26వ తేదీన గవర్నర్ సమక్షంలో చర్చల్లో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం 40 రోజుల నుంచి విద్యుత్ సౌధలో దీక్ష చేస్తు న్న 1,259 మంది ఏపి స్థానికత ఉద్యోగుల తో ఆయన ఆందోళనను విరమింపజేశారు. ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం ఈ నెల 26వ తేదీన గవర్నర్ సమక్షంలో సమావేశమై వీరి సమస్యలపై చర్చిస్తుందని దినేష్ హామీ ఇచ్చారు. దీక్ష విరమణ అనంతరం ఉద్యోగుల సంఘం కన్వీనర్ ఎస్.గిరిధర్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తున్న 1,170 మంది ఏపి స్ధానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్ధలు ఆకస్మాత్తుగా విధుల నుం చి తప్పించాయని ఆవేదన వ్యవక్తం చేశారు. ఏపి ట్రాన్స్‌కో జెఎండి ఇచ్చిన హామీ మేరకు దీక్షను విరమిస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి ఏపి యాజమాన్యం ముందు కు రాకపోతే ఆమరణ దీక్షలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.