రాష్ట్రీయం

అంగన్‌వాడీల టెక్ బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 19:అంగన్‌వాడీ సేవలు మరింత పారదర్శకం కానున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్టవ్య్రాప్తంగా ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ కొత్త విధానం అన్ని ప్రాజెక్టుల్లో అమలుకానుంది. ఇందుకోసం ఐసీడీఎస్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆధార్ కార్డులను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా నూతన విధానం అమలులోకి రానుంది. ప్రయోగాత్మకంగా ఎంపికచేసిన ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ ఏప్రిల్ నాటికి ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో 387 ఐసిడిఎస్ ప్రాజెక్టులు, 91,307 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇటీవల కాలంలో అమలులోకి వచ్చిన ఇస్నిప్ పథకం ద్వారా కామన్ అప్లికేషన్ సాప్ట్‌వేర్ సిస్టమ్‌ను ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోకి తీసుకురానున్నారు. ఐసీటీఆర్‌టీఎం (ఇన్‌ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రియల్ టైమ్ మోనిటరింగ్) విధానంతో క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా పోషక విలువలుగల ఆహారం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ విధానం అమలులోకి తెస్తున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు లబ్ధిపొందుతున్నారు. వీరందరికీ ఆధార్‌ను నూతన విధానం ఐసీటీఆర్‌టీఎంకు ఆనుసంధానం చేస్తారు. ప్రయోగాత్మకంగా ఎంపికచేసిన ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీచేసి అందులో ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేస్తారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల హాజరు, పూర్వ ప్రాథమిక విద్యకు హాజరయ్యే ఆరేళ్లలోపు చిన్నారుల హాజరు తదితర సమాచారం కచ్చితమైన వివరాలు ప్రభుత్వానికి అందేలా చరవాణుల్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు, చిన్నారుల ఎదుగుదల, ఎత్తు, బరువులు, ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు మొబైల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన వివరాలు రాష్ట్ర సంచాలకుల డ్యాష్‌బోర్డుకు నూతన సాఫ్ట్‌వేర్ సమాచారాన్ని చేరవేస్తుంది. కేంద్రానికిచ్చే మొబైల్స్‌కు జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం . ఇక లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం అర్హులకు చేరుతోందా లేదా పక్కదారి పడుతోందా అనే విషయాలను కచ్చితంగా తెలుసుకునేలా ఆధార్‌ను అనుసంధానం చేసి పూర్తిస్థాయిలో అధికారులు పర్యవేక్షించనున్నారు.
మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలుగా మార్చేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చిన్నారులకు అంగన్‌వాడీ కార్యకర్తలతో ఎల్‌కెజి, యుకెజి తరగతులకు విద్యాబోధన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా అంగన్‌వాడీ కేంద్రాలకు 23 రికార్డులను ఇచ్చారు. ఈ రికార్డుల్లో కేంద్రానికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపర్చాలి. అనంతరం 23 రికార్డుల నుంచి ఉపశమనం కలిగించి వాటిని 11కు కుదించారు. ఇక ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ రికార్డులకు సైతం చరమగీతం పాడి, సెల్‌ఫోన్లను తెరమీదకు తీసుకువస్తోంది. ఇకపై కాగిత రహిత పాలనకు ప్రాధాన్యమివ్వనున్నారు.

చిత్రం..అంగన్‌వాడీ టీచర్లు