రాష్ట్రీయం

పిడికిలి బిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఎల్‌బినగర్, మార్చి 19: సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘సమర సమ్మేళనం’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు తెలంగాణ రాష్ట్రంలో 93 శాతానికి పైగా ఉన్నారని, వారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చకపోతే లాల్, నీల్ జెండా ల ఆధ్వర్యంలో సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలు తప్పవని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను మహాజన పాదయాత్ర ఎలుగెత్తి చాటిందన్నారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సాగిన ఈ పాదయాత్ర ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసిందన్నారు. మహాజన పాదయాత్రను తెరాస, బిజెపి పార్టీలు అడ్డుకోవడానికి చూశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందుల పాల్జేసిందన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో దొంగ నోట్ల చెలామణీ ఇప్పటికీ జరుగుతూనే ఉందని అన్నారు. దేశంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కలసికట్టుగా మతకల్లోలాలను సృష్టిస్తున్నాయని విమర్శించారు.
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ లాల్, నీల్ జెండాలు ఏకమై చేసే పోరాటాలను ఏ రాజకీయ పార్టీ ఆపలేదన్నారు. బంగారు తెలంగాణ తెస్తానంటూ ఎన్నికల ముందు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సమస్యలను పక్కనబెట్టిందన్నారు. మోదీ ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దళితులకు అందే స్కాలర్‌షిప్‌లను నిలిపివేశారన్నారు. లాల్, నీల్ జెండాలు కలిసి సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఐదు నెలలపాటు 4800 కిలోమీటర్లు మహాపాదయాత్ర కొనసాగించిన తమ్మినేని వీరభద్రాన్ని సీతారాం ఏచూరి అభినందించారు.
వేలాదిమంది అమరవీరుల త్యాగఫలంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కెసిఆర్ ఇచ్చిన డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, కేజి టు పిజి ఉచిత విద్య వంటి హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టించని కెసిఆర్, 500 కోట్లతో ప్రగతి భవన్‌ను నిర్మించి కుటుంబంతో సహా నివాసముంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు కట్టకుండా పరిపాలన చేస్తే మీ బెడ్‌రూంలలో మిమ్మల్ని నిద్దురపోనివ్వమని తమ్మినేని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయకపోతే లాల్, నీల్ జెండాలు ఏకమై ఆందోళన చేపడతాయని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ప్రజాకవి గద్దర్, గోరటి వెంకన్న, విమలక్క తమ పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎంసిపి ఐజాతీయ కార్యదర్శి ఎండి గౌస్, తెలంగాణ సాయుధపోరాట యోధులు మల్లు స్వరాజ్యం, కాకి మాధవరావు, జస్టిస్ చంద్రకుమార్, చుక్కా రామయ్య, హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సిపిఎం సమర సమ్మేళనం