రాష్ట్రీయం

సంక్షేమమే సగం బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: దేశంలో అసలైన కమ్యూనిస్టు నాయకుడు కెసిఆర్ అని ఐటి మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాకు చెందిన సిపిఎం నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్‌లో సోమవారం తెరాస పార్టీలో చేరారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి, బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే సిపిఎం శ్రేణులు తెరాసలో చేరడం విశేషం. తెలంగాణ భవన్ సిపిఎం కార్యకర్తలతో నిండిపోయింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కెసిఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో 40వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు పేదల సంక్షేమానికే అన్నారు. ఇవన్నీ కమ్యూనిస్టులు చేయాల్సిన పనులని, కానీ తెరాస చేస్తోందన్నారు. ఆరోగ్యానికి పాదయాత్ర మంచిదని సిపిఎం నాయకులు తమ్మినేని వీరభద్రానికి ముందే చెప్పామని కెటిఆర్ చమత్కరించారు. కేరళ సిఎం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను, టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారని, దేశంలో ఉన్న ఏకైక సిపిఎం ముఖ్యమంత్రి కూడా కెసిఆర్ పాలనను మెచ్చుకున్నారని అన్నారు. వరంగల్‌లో ఆరువేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. తెరాసలో చేరుతున్న సిపిఎం శ్రేణులకు స్వాగతం పలికారు.
టిఆర్‌ఎస్‌లో చేరి బతుకులు బాగు చేసుకుందామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ్మినేని నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెరాస ప్రభుత్వంపైన, కెసిఆర్ పైన అక్కసు వెళ్లగక్కారని, ఈరోజు సిపిఎం శ్రేణులు తెరాసలో చేరడం ద్వారా తమ్మినేని మాటల్లో నిజం లేదని చెప్పినట్టయ్యిందని అన్నారు. వరంగల్‌లో గుడిసెలు వేసుకున్న వారు ఐదువేల మంది వరకూ ఉన్నారని, వారికి తెరాస ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఏ సమస్యవున్నా తనవద్దకు రావాలని చెప్పారు. సిపిఎంలో అగ్ర నాయకులు తప్ప సామాన్యులు బాగుపడరని ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు చందాలు వసూలుచేసి అగ్ర నేతలకు ఇస్తారన్నారు. వరంగల్‌లో గుడిసెలు వేసుకున్న వారికి ఇళ్లు ఇస్తే తెరాస ప్రభుత్వాన్ని వాళ్లు జన్మలో మరిచిపోరని అన్నారు.
తెరాసలో చేరిన సిపిఎం నాయకులు మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ తాను 28ఏళ్లపాటు సిపిఎంలో పని చేశానని, బీసీల కోసం ఏ పార్టీ చేయని పని తెరాస ప్రభుత్వం చేస్తోన్న కారణంగానే ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. సిపిఎం కార్పొరేట్ పార్టీగా మారిందని అన్నారు. 2019 ఎన్నికల్లో సిపిఎం కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.