రాష్ట్రీయం

ఆ జీవోలను రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జనవరి 8: హిందూ ధర్మానికి, దేవాలయ వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారే జీవోలను ప్రభుత్వం విడుదల చేయడం దుర్మార్గమైన చర్యగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదాల ఆదాయంలో పన్ను చెల్లించాలని, విద్యానిధి కింద ఆదాయంలో ఒక శాతం దేవాదాయ శాఖకు జమ చేయాలని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై స్వామీజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సింహాచలంలో శుక్రవారం నృసింహ దీక్షల విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భక్తులు కానుకలు, మొక్కుబడుల రూపంలో భగవంతుడికి ఇచ్చే సొమ్మును వివిధ రూపాల్లో లాక్కోవాలని, చివరకు ప్రసాదాల ద్వారా వచ్చే సొమ్ముపై కూడా ఆశపడే స్థాయికి దేవాదాయ శాఖ దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడి భూములను ప్రజలకు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.
రాజకీయ నేతలు తమ అనుచరులకు భూములను కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింహాచలం, అన్నవరం వంటి దేవస్థానాలు విద్యాలయాలు నడుపుతున్నాయని, ఈ నేపథ్యంలో విద్యానిధికి లక్షల రూపాయలు ఇవ్వాలనటం దుర్మార్గమని ఆయన అన్నారు. దేవాదాయ శాఖకు చెల్లించే ఆ సొమ్ముతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా దేవస్థానాలు తమ విద్యాలయాలను నడుపుకోవచ్చునని స్వామీజీ సూచించారు. దేవాలయాలకు ట్రస్టీలను వేసి వారి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించడం అనవసరమని ఆయన అన్నారు. ప్రభుత్వం మారితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తే ఇష్టారాజ్యంగా జీవోలు విడుదల చేసి దేవాలయ వ్యవస్థను, హిందూ సమాజాన్ని దెబ్బతీయాలని చూడడం సబబుకాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి జీవోలు ఉపసంహరించేలా చేయాలని లేకపోతే పోరాటం తప్పదని స్వామీజీ హెచ్చరించారు. దేవాదాయ శాఖ, దేవాలయాలు సుభిక్షంగా ఉండకపోతే పాలకులకు, రాష్ట్రానికి అరిష్టమని స్వామీజీ హెచ్చరించారు. ఇలాంటి చర్యలవల్లనే ప్రజలకు హిందూ మతంపై విశ్వాసం పోయి అన్యమత ప్రాబల్యం పెరిగిపోతోందని స్వామీజీ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, మత మార్పిళ్లను అరికట్టేందుకు చివరిదాకా పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. భక్తులతో బంధుత్వం కలుపుకున్న భగవంతుడు ఉండటమే హిందూ మతం గొప్పతనమని స్వరూపానందేంద్రస్వామి అన్నారు.
నృసింహ దీక్షల విరమణకు వచ్చిన వందలాది మంది గిరిజనులు, భక్తులనుద్దేశించి స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా జరుగుతున్న మత మార్పిళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. మహోన్నతమైన హిందుత్వాన్ని కాదని విదేశీ మతాలు వేసే చిల్లరకు ఆశపడవద్దని స్వామీజీ పిలుపునిచ్చారు. హిందూ మతంపై జరుగుతున్న దాడులు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు హిందువులంతా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
chitram..
సింహాచలంలో విలేఖరులతో మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి