రాష్ట్రీయం

సిబిఐ విచారణకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: అగ్రిగోల్డు ఆస్తులపై గురువారం శాసనసభలో దుమారం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. బాధితులకు న్యాయం.. ఆస్తుల వేలం.. అక్రమ కొనుగోళ్ల వ్యవహారంపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అగ్రిగోల్డు బాగోతం గత పదేళ్ల క్రితం నుంచి ఉందన్నారు. ఆస్తుల వేలం, బాధితులకు చెల్లింపులపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిసిఐడి ప్రక్రియ కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నందున వారి ఆచూకీ చెబితే 10 లక్షల రివార్డు కూడా ప్రకటించామని గుర్తుచేశారు. ఆర్థిక నేరాలన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమే అన్నారు. కృషి, చార్మినార్, వాసవి బ్యాంకులు ఈ కోవలోకి చెందినవే అన్నారు. తమ ప్రభుత్వం ఆర్థిక నేరాల నియంత్రణకు రెండు ఇంటెలిజెన్స్ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ సెంటర్, ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి, మోసగాళ్లను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీ రికార్డుల ప్రకారం వివిధ రాష్ట్రాలలో 32,02,607 మంది బాధితులు నష్టపోయారని వివరించారు. ఏపిలో 19లక్షల మంది డిపాజిటర్లు నాలుగువేల కోట్ల మేర మోసపోయారన్నారు. హైకోర్టు పరిధిలో సిఐడి కృష్ణాజిల్లాలోని కీసరలో ఉన్న 11 ఆస్తులలో నాలుగింటిని విక్రయించి 16.05 కోట్లు రికవరీ చేసిందన్నారు. కోర్టు మార్గదర్శకాల మేరకే ప్రక్రియ కొనసాగుతోందని, బాధితులు కోరితే విచారణ బాధ్యతలు సిబిఐకి అప్పగించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇలాంటి నేరాలను నియంత్రించేందుకు ఈ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టుకు సవరణలు తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. బాధితులకు పైసాతో సహా రికవరీ చేసి అప్పగిస్తామని, మృతుల కుటుంబాలకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంకా మిగిలిన బాధితుల పేర్లను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే విషయమై పరిశీలిస్తామన్నారు.
మానవత్వం లేని సిఎం: జగన్
ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్ష నేత జగన్ స్పందిస్తూ సిఎం కొద్దిగా అయినా మానవత్వం ప్రదర్శిస్తారేమో అని బాధితులు నిరీక్షిస్తున్నారని, లక్షమంది డిపాజిటర్లకు 3957 కోట్లు బకాయిలు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా 72 లక్షల మందికి 7603 కోట్ల మేర అగ్రిగోల్డు చెల్లించాల్సి ఉందన్నారు. ఏపిలో 19.5లక్షల మంది బాధితులను ఆదుకునేందుకు 1182 కోట్లు ప్రభుత్వం కేటాయించక పోవటం దౌర్భాగ్యమన్నారు. ఈ కేసులో సిఐడి విచారణ దారుణంగా ఉందన్నారు. ఇప్పటివరకు సిఐడి చేతిలో ఉన్న ఆస్తుల విలువ 18వేల 682 ఎకరాలు కాగా వాటి మార్కెట్ విలువ 7300 కోట్ల రూపాయలుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. మరో 90వేల చదరపు గజాల భూములను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. అగ్రిగోల్డు వ్యవస్థాపకులలో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారని వారిలో సీతారాం అనే డైరెక్టర్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని నిలదీశారు. బాధితుల పేర్లను ఆన్‌లైన్‌లో ఎందుకు పొందుపరచటంలేదో వివరించాలని డిమాండ్ చేశారు.