రాష్ట్రీయం

15మంది ఐపిఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 15 మంది సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె పూర్ణ చంద్రరావును అవినీతి నిరోధక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. అయితే రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఆపరేషన్స్ అదనపు డిజి గోవింద్ సింగ్‌ను సిఐడి అదనపు డిజిగా బదిలీ చేశారు. హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీసు (ట్రాఫిక్) జితేందర్‌ను పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సిఐడి ఐజి డాక్టర్ సౌమ్య మిశ్రాను పోలీసు సంక్షేమ శాఖ ఐజిగా బదిలీ చేశారు. కాగా ఆమె సిఐడి విభాగం పూర్తిస్థాయ అదనపు బాధ్య తలు నిర్వహించనున్నారు. డిసిపి స్టీఫెన్ రవీంద్రను పదోన్నతిపై కల్పించి వెస్ట్ జోన్ ఐజిగా, హైదరాబాద్ రేంజి ఇన్‌చార్జీ డిఐజిగా నియమించారు. ఐజిపి టివి శశిధర్‌రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించారు. హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్‌కు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. వరంగల్ రేంజ్ డిఐజి రవివర్మను కరీంనగర్ రేంజ్ డిఐజిగా, అక్కడ పనిచేస్తున్న నాగిరెడ్డికి వరంగల్ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా సిఐడి, డిఐజిగా ఉన్న ఎన్ శివధర్‌రెడ్డిని నిజామాబాద్ రేంజ్ డిఐజిగా బదిలీ చేశారు. ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసీంను పదోన్నతిపై సైబరాబాద్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఈస్ట్‌జోన్ డిసిపిగా ఉన్న డాక్టర్ రవీందర్‌కు పదోన్నతి కల్పిస్తూ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఏసిబి జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న ఎ సత్యనారాయణకు పదోన్నతి కల్పిస్తూ ఏసిబి అదనపు డైరెక్టర్‌గా నియమించారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ఉన్న తరుణ్ జోషిని రాచకొండ జాయింట్ కమిషనర్ ఇన్‌చార్జిగా బదిలీ చేశారు. ఎల్‌బినగర్ డిసిపిగా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్‌ను ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న మి నవీన్‌కుమార్‌ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.