రాష్ట్రీయం

కరెన్సీపై మొక్కల బొమ్మలు ముద్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 27: భారత కరెన్సీపై పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసే విధంగా మొక్కల చిత్రాలను ముద్రించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పద్మశ్రీ దరిపల్లి రామయ్య అన్నారు. ఈయన ఢిల్లీలో ఈ నెల 30వ తేదీన రాష్టప్రతి చేతుల మీదుగా రామయ్య పద్మశ్రీ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీని కలసి తన ఆలోచన తెలియజేయనున్నానన్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఇతర దేశాల్లో మొక్కలను భారతదేశానికి తీసుకురావాలని కోరనున్నట్లు తెలిపారు. రాజ్‌భవన్‌లో రాష్టప్రతి అనుమతితో రెండు ఎర్రచందనం, రెండు శ్రీగంధం, రామఫలం, లక్ష్మణఫలం, అశోక మొక్కలను నాటుతానన్నారు. ప్రపంచంలోనే భారతదేశ సంస్కృతి విభినమైనదని, మొక్కలను నాటే విషయంలో కూడా దానిని అమలు చేయాలన్నారు. కేంద్రం ఇప్పటికే స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, అదే తరహాలో మొక్కలు పెంచే అంశాన్ని ఉద్యమంలా తీసుకోవాలన్నారు. తాను ఢిల్లీలో ఈ అంశంపై ప్రధానమంత్రితో పాటు అందరినీ కలిసి విన్నవిస్తానన్నారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్ళారు.