రాష్ట్రీయం

పన్ను ఎందుకు మినహాయించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమదేవి తెలుగు సినిమాలకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు వినోదం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ ప్రేక్షకుల సంఘం తరపున ఎం వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసులో సినీ నిర్మాతులు రాజీవ్ రెడ్డి, గుణశేఖర్, సినీనటుడు బాలకృష్ణకు కూడా నోటీసులు జారీచేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.