ఆంధ్రప్రదేశ్‌

హేమలంబలో ఇబ్బందులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 29: హేమలంబ నామ సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలూ విపత్కర పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. ఉగాది సందర్భంగా శారదాపీఠంలో బుధవారం జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమం అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ ఉగాది అంటే సృష్టి కర్త బ్రహ్మ ఈ సృష్టిని మొదలు పెట్టిన రోజని, అందుకే యుగారంభానికి సంకేతంగా యుగాది అంటారన్నారు. సూర్య,చంద్రాది గ్రహాలు, నక్షత్రాల ప్రభావం మనపై చూపే ప్రభావాన్ని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటామన్నారు. హేమలంబ నామ సంవత్సరానికి అధినేత బుధుడు. బుధ గ్రహ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సకాలంలో వర్షాలు కురవక, కురినా అకాల వర్షాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయన్నారు.
వాతావరణ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా, ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇక వాతావరణ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని ఇబ్బంది పెడతాయన్నారు. పాలనా పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు పొడసూపుతాయని, విపక్షాల ఆరోపణలతో అధికార పక్షాలు ఇరుకున పడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాలకుల్లో భక్తి భావం పెరగాలని హితవు పలికారు. దేవాదాయ శాఖను ముందు పెట్టి దేవాలయాలను ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తీసుకుని ఆదాయ కల్పన కేంద్రాలుగా మారుస్తున్నాయన్నారు. దేవాలయాలు స్వరూపాలను మార్చి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, యజ్ఞ,యాగాదులతో దేశం సుభిక్షంగా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. అలాగే ప్రజలు కూడా తమ ఇళ్లల్లో పూజలు చేయడంతో పాటు లలిత, విష్ణు సహస్ర నామార్చనలు చేయాలన్నారు. ఇటువంటి భక్తి,్భవ చర్యల కారణంగా గ్రహాల దుష్ప్రభావం నుంచి కొంతైనా ఉపశమనం కలుగి, ప్రజలు సుఖ,సంతోషాలతో జీవిస్తారన్నారు. అంతకు మందు ఆస్థాన పండితులు కృష్ణశర్మ, హనుమాన్ శర్మ ఆధ్వర్యంలో వేదస్వస్తి జరిగింది. అనంతరం ఆస్థాన పండితులు పంతుల రామలింగశర్మ పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తున్న స్వరూపానందేంద్ర