రాష్ట్రీయం

అర్చకులకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం పునరుద్ధరిస్తామంటూ గతంలో పాలకులు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని చిన్నదేవాలయాల అర్చకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఒక జీఓను విడుదల చేసినప్పటికీ, తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) అడ్డుకోవడంతో జీఓ అమలుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్, నియమావళి రూపకల్పనలో జాప్యం జరుగుతోందని అర్చక సంఘాల ప్రతినిధుల అసంతృప్తి వ్యక్తం చేశారు. టిటిడి పరిపాలనకు, ఉభయ రాష్ట్రాల్లోని ఇతర దేవాలయాల పరిపాలనకు సంబంధం లేదు. టిటిడిలో మిరాశీ వ్యవస్థ (ఆదాయంలో అర్చకులకు భాగం) ఉండేది. దాన్ని గతంలోనే రద్దు చేశారు. ఈ మిరాశీ వ్యవస్థ కావాలని టిటిడి అర్చకులు కోరడం లేదని తిరుమల ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారు డాక్టర్ ఎ.వి రమణ దీక్షితులు తెలిపారు. రమణ దీక్షితులు ఎపి ప్రభుత్వానికి ఇటీవల ఒక లేఖ రాస్తూ, మిరాశీ వ్యవస్థను తాము కోరడం లేదని, అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెక్షన్ 142ప్రకారం టిటిడిలో మర్యాదలు, బహుమానాలు వంశపారంపర్య అర్చకులకే చెందాలని స్పష్టం చేశారు. 2007 చట్టం ప్రకారం అనువంశికంగా అర్చకత్వం చేసే అవకాశం ఉందన్నారు. సెక్షన్ 144 ప్రకారం వంశపారంపర్య అర్చకుల జీవనోపాధికోసం ఒక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని టిటిడి పాలకమండలి ఒక తీర్మానాన్ని చేసిందని ఆయన గుర్తు చేశారు. టిటిడి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మాత్రం కోర్టు తీర్పులను, ప్రభుత్వ చట్టాలను అమలు చేయడం లేదని తెలిపారు. కోర్టు తీర్పు, ప్రభుత్వం చేసిన చట్టాలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన లేఖలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పురాతనమైన చిన్న దేవాలయాల్లో సెక్షన్ 34(3) ప్రకారం వంశపారంపర్య హక్కును పునరుద్ధరించాలని, ఎపి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎ.ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ, దేవాదాయ చట్టాన్ని (33/2007) అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు వివరించారు. కోర్టు తీర్పులు, ప్రభుత్వం వేసిన కమిటీలు చేసిన సూచనల ప్రకారం చిన్న దేవాలయాల్లో అర్చకుల వారసత్వ పద్ధతి కొనసాగించాలని దేవాలయ పరిరక్షణ ఉద్యమ సంధానకర్త యం.వి. సౌందరరాజన్ కోరారు. ఇందుకు అనుగుణంగా ఎపి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.