రాష్ట్రీయం

విష వాయువులు పీల్చి ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 30: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఒక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో గురువారం వెలువడిన విష వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతిచెందారు. ప్లాంటులోని వ్యర్థ పదార్థాల ట్రీట్‌మెంట్ ప్లాంటు ట్యాంకును శుభ్రంచేసే ప్రయత్నంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మొగల్తూరు గ్రామం నల్లంవారితోటలోని ఆనంద గ్రూపునకు చెందిన ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంటులో ఉదయం 10 గంటల సమయంలో ఐదుగురు కార్మికులు వ్యర్ధ పదార్ధాల ట్రీట్‌మెంట్ (రీసైక్లింగ్) యూనిట్ వద్దకు వెళ్లారు. అక్కడి ట్యాంకును శుభ్రపరచడానికి లోనికి దిగిన కార్మికుడు కేకలు వేయడంతో ఏం జరిగిందోనని ఒకరి తర్వాత ఒకరుగా మిగిలిన నలుగురు కూడా లోనికి దిగారు. ట్యాంకులోని విష వాయువుల ప్రభావంతో ఐదుగురూ ట్యాంకులోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. దీన్ని గమనించిన సహచర కార్మికులు హుటాహుటిన వారిని వెలుపలికి తీసుకొచ్చారు. అప్పటికే వారు మృతిచెందారు. మృతుల్లో ఈదా ఏడుకొండలు (25), తోట శ్రీనివాస్ (25), బొడ్డు రాంబాబు (27), జక్కంశెట్టి ప్రవీణ్ (22), నల్లం ఏడుకొండలు (18) ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులతోపాటు వివిధ ప్రజా, కులసంఘాల నేతలు కూడా అక్కడకు చేరుకున్నారు. మృతుల బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. మృతదేహాల తరలింపును అడ్డుకున్నారు. ఆ సమయంలోనే కొందరు ఆందోళనకారులు ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు. ప్లాంటుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్లాంటు బయట ఉన్న వస్తువులు, పరికరాలను ధ్వంసంచేశారు. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంటులోని ట్రీట్‌మెంటు ప్లాంటు ట్యాంకులోని విషవాయువుల కారణంగానే మరణాలు సంభవించి ఉంచవచ్చని ఫ్యాక్టరీల విభాగం డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మోహనరావు తెలిపారు.
ప్లాంటు మూసివేస్తాం: మంత్రి సుజాత
ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంటులో ప్రమాదానికి గురైన మృతిచెందిన ఐదుగురి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర స్ర్తి, శిశుసంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల వంతున పరిహారం చెల్లిస్తామన్నారు. ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంటులో మృతిచెందిన ఐదుగురి మృతదేహాలను నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో మంత్రులు సుజాత, మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా మంత్రి సుజాత విలేఖర్లతో మాట్లాడారు. ఐదుగురి మృతికి కారణమైన ఆనందా ఆక్వా ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్లాంటును మూసివేస్తామని ప్రకటించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు.

చిత్రం.. మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు