రాష్ట్రీయం

నేనున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 30: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటానని సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఏజెంట్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యగా 13లక్షల మంది చిన్న ఖాతాదారులకు రూ.1,180కోట్లు విడుదల చేయాలన్నారు. అసలు రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఉన్న ఆస్తులు, వేల ఎకరాలు, వాటి విలువ ప్రజలకు చెప్పాలని, ఇందుకోసం ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ వామపక్షాలతో కలిసి పోరాడతానని ప్రకటించారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగితే పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయి ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎంపిలు, ఎమ్మెల్యేలు అధికారులపై దాడులకు పాల్పడుతుంటే బ్యూరోక్రసీ బలం నిర్వీర్యమవుతుందని, అందుకే అగ్రిగోల్డ్ వంటి కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్‌పై అధికార పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేల దాడిని పవన్ ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. కేసుల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వానికి చెందాలి గానీ ప్రభుత్వంలోని వ్యక్తులకు కాదన్నారు. అలా జరగకుండా చూడాలని తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రిని కోరుకుంటున్నానని అన్నారు. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అగ్రిగోల్డ్ బాధితులతో పవన్ విజయవాడలో గురువారం ముఖాముఖీ మాట్లాడారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లిన పవన్ ఆ తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుని అగ్రిగోల్డ్ బాధితులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 400మంది బాధితులు తరలివచ్చారు. వీరిలో ఏజెంట్లు, ఖాతాదారులు ఉన్నారు. ఇల్లు, పొలం అమ్ముకుని కొందరు.. రిటైర్‌మెంట్ సొమ్ముతో కొందరు, అప్పుచేసి మరికొందరు ఇలా.. లక్షలు డిపాజిట్లు చేశామని ఖాతాదారులు, ఖాతాదారులతో డబ్బు కట్టించి అవస్థలు పడుతున్నామని ఏజెంట్లు పవన్ ఎదుట తమ గోడు వెలిబుచ్చారు. వారిని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయం జరుగుతుందని భావించానన్నారు. కాని కోర్టే అసహనం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగంపై అనుమానం కలిగిందన్నారు. అందుకే ముందుకు వచ్చానని చెప్పారు. చట్టం సామాన్యులకు ఒకలా.. బలవంతులకు మరోలా పని చేస్తోందనడానికి అగ్రిగోల్డ్ ఉదాహరణ అన్నారు. వందల చెక్కులు బౌన్స్ అయినరోజే ప్రభుత్వం స్పందించాల్సి ఉంటే ఇక్కడి వరకు వచ్చేది కాదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కారుచౌకగా కొట్టేయాలని ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తే శవాలపై చిల్లర ఏరుకున్నట్లేనని ఘాటుగా స్పందించారు. యాజమాన్యాన్ని, ఆర్థిక నిపుణలను కూర్చోబెట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. తదుపరి కార్యాచరణ కోసం జనసేన తరుఫున పోతిన మహేష్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో చర్చించి నివేదిక తయారు చేయాలని సూచించారు.

చిత్రం..అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడుతున్న పవన్‌