రాష్ట్రీయం

ఏపి చరిత్రలో బ్లాక్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది రాజ్యాంగానికి, రాష్ట్రానికి జరిగిన ఘోర అవమానమని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ఆదివారం జరిగినది మంత్రి మండలి విస్తరణ కాదని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బ్లాక్ డే అని అన్నారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టిడిపిలోకి చేర్చుకోవడం దిగుజారుడు చర్య అన్నారు. వారిలో నలుగురిని పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించకుండా, అనర్హత వేటు వేయకుండా మంత్రులుగా ప్రమాణం చేయించడం రాజ్యాంగ ఉల్లంఘనే కాదు.. బరితెగింపుచర్య అన్నారు. వీరంతా ఎన్నకైన పార్టీ బి ఫామ్‌ను, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినవారేనన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద ఏ మాత్రం విశ్వాసం ఉన్న వారైనా సమర్ధించగలరా అని ప్రశ్నించారు. ఈ చర్యలను ప్రజలు కలకాలం సహించే ప్రసక్తి ఉండదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ అంశాలపై తీర్పు ఇస్తారని జగన్ అన్నారు.