రాష్ట్రీయం

డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/విజయవాడ, ఏప్రిల్ 3: రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని కేసు ఇది. ఏసిబి అధికారులు దాడులు జరిపినప్పుడు అవినీతిపరులు అక్రమాస్తుల్ని ఎలా కూడబెట్టారో, ఎక్కడెక్కడ దాచారో తెలుసుకోగలుగుతారు. కానీ ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం తను కూడబెట్టిన అక్రమాస్తులను ఏసిబి కంటపడకుండా డొల్ల కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఈ వైనం గమనించిన ఏసిబి అధికారులు విస్తుపోయారు. ఈ విషయాన్ని విశాఖ ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సోమవారం విలేఖరులకు తెలిపారు. కాగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లోని గంగాధరం ఆస్తులపై సోమవారం కూడా దాడులు కొనసాగాయి. శనివారం జరిగిన దాడుల్లో సుమారు 100 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడగా, సోమవారం జరిగిన దాడుల్లో మరిన్ని ఆస్తులు వెలుగు చూశాయి. గంగాధరం సంపాదించిన ఆస్తులను ఆరు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. ఐమ్యాజిక్స్ పొలారీస్‌లో 24 లక్షలు, సుప్రజ హెచరీస్‌లో 35 లక్షలు, నమిత హోమ్స్‌లో 1.5 కోట్లు, ఎస్‌విఎస్ లాజిస్టిక్స్‌లో ఐదు లక్షలు, ఆర్ ఆర్ ఫార్మ్స్, ఎస్‌ఎస్ ఫార్మ్స్ పేరిట చావలిలో 5.37 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు ఏసిబి కూపీ లాగింది.
సోమవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని రెండు ఆంధ్రా బ్యాంకులు, జెడ్ కాలనీలోని హెస్‌బిహెచ్, సనత్‌నగర్, కూకట్‌పల్లిలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు, కూకట్‌పల్లిలోని కోటక్ మహీంద్రా బ్యాంక్, కూకట్‌పల్లి పంజాబ్ నేషన్ బ్యాంక్‌ల్లో గంగాధరం, ఆయన బంధువులకు సంబంధించిన లాకర్లను తెరిచారు. ఇందులో ఐదు లాకర్లలో గంగాధరం అక్రమాస్తులు వెలుగు చూశాయి. లాకర్ నెంబర్ 5లో ఒరిజినల్ డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఇవి నెల్లూరు జిల్లా కల్లూరు ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు. వీటితోపాటు ఇదే ప్రాంతంలో గంగాధరానికి చెందిన 19 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఈ భూమిని ఆనుకుని ఆరు ఎకరాల డి పట్టా భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా గంగాధరం లాకర్‌లో దొరికాయి. నాలుగు ఎకరాల భూమి విలువ 1.53 కోట్ల రూపాయలు ఉంటుందని డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలియచేశారు. అలాగే ఈ లాకర్లలో రెండు కిలోల బంగారం దొరికింది. అదేవిధంగా గంగాధరం అకౌంట్‌లో 21.79 లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. విజయవాడలోని గంగాధరం తాత్కాలిక కార్యాలయంలో హార్డ్ డిస్క్, 2.15 లక్షల రూపాయలను ఏసిబి అధికారులు సోమవారం సీజ్ చేశారు. సున్నపుబట్టీల సెంటర్ ప్రాంతంలో గంగాధరానికి చెందిన గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు జరిపి, రూ.2.40 లక్షల నగదు ఇతర విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్