తెలంగాణ

ఎంజిఎం హాస్టల్‌లో కలుషితమైన ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 8: వరంగల్ ఎంజిఎం నర్సింగ్ విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ అయింది. నర్సింగ్ హాస్టల్‌లో 243మంది విద్యార్ధినిలు ఉండగా అందులో దాదాపు 30మందికి పైగా విద్యార్ధినిలు తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న 12మంది విద్యార్ధినిలకు ఎఎమ్‌సి వార్డులలో చికిత్స అందిస్తున్నారు. హాస్టల్‌లో భోజనం, టిఫిన్ సక్రమంగా లేకపోవడంతో పాటు హాస్టల్‌లో ఉన్న ఫ్రిజ్‌లో బల్లి ఉండడం వల్ల విద్యార్ధినిలు తిన్న ఆహారం పాయిజనై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన పట్ల ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అందుకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు వార్డెన్లను తక్షణమే విధుల నుండి తొలగించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క, జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు తదితరులు చికిత్స పొందుతున్న విద్యార్ధినిలను పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టల్‌లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచిన్నట్లు కనిపిస్తుందని, అంతేకాకుండా జిల్లాలో ఉన్న అనేక సంక్షేమ హాస్టల్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అస్వస్థతకు గురై ఎంజిఎంలో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థినులు