తెలంగాణ

సర్పంచ్ ఇంటిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 8 : ఒక బీడీ కంపెనీలో మునీంగా పనిచేస్తున్న యువకుడిని సర్పంచ్ కుమారులు కొట్టి చంపారని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు మూకు మ్మడిగా దాడి చేసి సర్పంచ్ ఇంటిని తగులబెట్టారు. అడ్డుకోబో యన పోలీసులపై రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో సర్పంచ్ కుంబాల లక్ష్మి బంధువు మృతి చెందడంతో అంతిమ యాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో గ్రామంలోని బీడీ కంపెనీలో మునీంగా పనిచేస్తున్న శ్రీరాం శ్రీహరి (33) తన బైక్‌కు కట్టిన గంప తగిలి సర్పంచ్ లక్ష్మి కింద పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తమ తల్లికి జరిగిన సంఘటనను తెలుసుకున్న సర్పంచ్ కుమారులు ఎల్లారెడ్డి, నాగిరెడ్డి గ్రామంలోని శ్రీహరిని ప్రశ్నించగా వారి మధ్య మాటమాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో వారు అతనిపై దాడి చేసి కొట్టారు. శ్రీహరి తన స్నేహితులు, బంధువులను ఫోన్ చేసి పిలిపించడంతో ఇరువర్గాల మధ్య మరోసారి గొడవకు దారితీసింది. ఇరువర్గాలు దాడి చేసుకొని కొట్టుకున్నారు. అనంతరం శ్రీహరిని కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన ఆనంతరం అతని సొంత గ్రామమైన సిరిసిల్ల మండలం జిల్లెల్లకు తీసుకెళ్లారు. అయతే, తెల్లవారుజామున వాంతులు చేసుకుని శ్రీహరి మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జిల్లెల్ల, తెర్లమద్ది, ముస్తాబాద్ గ్రామాలకు చెందిన ప్రజలు, మృతుని బంధువులు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆటోలు, మోటార్ బైక్‌లో ఇబ్రహింపూర్ సర్పంచ్ కుంబాల లక్ష్మి ఇంట్లోకి వెళ్లి ఆమెను, ఆమె చిన్నకోడలుపై దాడి చేశారు. మహిళ సంఘాల నేతలు సర్పంచ్ లక్ష్మిపై దాడి చేసి తీవ్ర స్థాయిలో కొట్టారు. పక్కన వున్న మరో ఇంట్లో ఆమెను నిర్బంధించారు. ఆనంతరం పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించారు. దాదాపు నాలుగు గంటల పాటు గ్రామంలో విధ్వంసం చేసి దహనకాండను జరిపారు. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక కేంద్రం వచ్చిన మంటలను ఆర్పకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చిన సిద్దిపేట రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలో మునీం శ్రీహరి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేసుకొని మరికొంతమంది పరిసర గ్రామాల ప్రజలు ట్రాక్టర్లు, ఆటోల్లో తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులను సైతం లెక్కచేయకుండా విధ్వంసాన్ని సృష్టించారు. పోలీసులపై రాళ్లు, చెప్పులతో దాడి చేయడంతో పాటు, దుమ్మెత్తి పోశారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీసులు సంఘటన స్ధలానికి వచ్చిన వారిని అదుపుచేయలేకపోయారు. సిద్దిపేట రూరల్ సిఐ ప్రసన్నకుమార్ తన బలగాలతో వచ్చినా ఆందోళనకారులు పెద్దఎత్తున ఉండటం వల్ల ఏమీచేయలేకపోయారు. ఈక్రమంలో సిద్దిపేట, మెదక్ సబ్ డివిజన్‌కు చెందిన పోలీసు బలగాలను రప్పించే యత్నం చేశారు. ఇంట్లోని రెండు గ్యాస్ సిలిండర్లు పెద్దశబ్దంతో పేలడంతో పలువురు భయకంపితులయ్యారు. చివరకు పోలీసులు లాఠీచార్జి చేసి, శ్రీహరి మృతదేహాన్ని తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామాన్ని హైదరాబాద్ రేంజి ఐజి నవీన్‌చంద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఎస్పీలు సుమతి, జోయల్ డేవీస్, ఓఎస్‌డి సుబ్బరాయుడు సందర్శించారు. ఇప్పటికే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో పెద్దఎత్తున పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్ ఇతర పోలీసు బలగాలు వచ్చి ఆందోళన కారులను చెదరగొట్టే యత్నం చేయగా పోలీసులపై రాళ్లు రువ్వారు. అనంతరం పో లీసులు లాఠీచార్జ్జి జేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. గ్రామ సర్పంచ్ చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు..దగ్ధమైన సర్పంచ్ ఇల్లు..సంఘటన స్థలాన్ని సందర్శించిన ఐజి నవీన్‌చంద్, మెదక్, కరీంనగర్ ఎస్పీలు