రాష్ట్రీయం

ఆ ట్రస్ట్‌కు నిధులివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు నిధులను పంపిణీ చేయరాదని తిరుమల తిరుపతి దేవస్ధానంను హైకోర్టు ఆదేశించింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు నిధులు విడుదల చేయకుండా స్టే మంజూరు చేసింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు టిటిడి ప్రతి నెల 5వ తేదీ ముందు రూ.50 లక్షల నిధులు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రశ్నిస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన పి నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షామీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్రప్రభుత్వం టిటిడి ప్రతి నెల రూ. 50 లక్షలను ట్రస్టుకు ఇవ్వాలని జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఎండోమెంట్ చట్టం 1987 సెక్షన్ 111ను ఉల్లంఘించి రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుతో టిటిడికి అనుబంధం లేదని, టిటిడి నిర్వహించే హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాల్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని టిటిడి ఏ విధంగా నిధులు మంజూరు చేస్తోందని, టిటిడి నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వం జీవోను జారీ చేయడమేంటని ప్రశ్నించింది. దేవాదాయ శాఖ జీవో జారీ చేయడం తగదని, ఇది విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. కాని సంస్ధలకు నిధులు ఇచ్చే అలవాటు టిటిడికి ఉంది, ఇది కొత్తేమీ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవో ప్రాతిపదికన టిటిడి నిధులను హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ఇవ్వరాదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరుతూ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.