రాష్ట్రీయం

ముందుంది గడ్డుకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు తీవ్రప్రతాపం చూపించటంతో కృష్ణా బేసిన్ ఎడారిని తలపిస్తోంది. అంతంత మాత్రంగావున్న నీటి లభ్యత, దీనికితోడు శరవేగంగా నీటి ఆవిరి ఉండటంతో వచ్చే నాలుగు నెలలు మంచినీటికి కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌పై ఆధారపడి ఉన్న 30 పురపాలక సంఘాలకు మంచి నీరు సరఫరా చేయడం సవాలుగా మారింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు కలిపి మొత్తం 583.31 టిఎంసి నీటికి కేవలం 162.86 టిఎంసి నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
పెన్నార్ బేసిన్‌లో సోమశిల, కండలేరు, వెలుగోడు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కలిపి 172.98 టిఎంసికి కేవలం 21.98 టిఎంసి నీరు అందుబాటులో ఉంది. ఆల్మట్టి నుంచి దిగువనున్న ప్రకాశం బ్యారేజీ వరకూ అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకరస్ధాయికి పడిపోయాయి. ఇప్పుడున్న ఎండలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున కృష్ణా, పెన్నా బేసిన్ లభ్యతలో ఉన్న నీరు మే 15వరకు సరిపోతాయని సాగునీటి ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ నెలలో ప్రారంభమవుతాయి. వర్షాలు కురిసినా, ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌తో పాటు అంతకంటే ఎగువునున్న మహారాష్టల్రో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిండితే తప్ప నీరు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు చేరదు. ఆల్మట్టి నిండిన తర్వాత కాని నీరు దిగువకు కర్నాటక వదలదు. దీన్నిబట్టి చూస్తే ఈ ఏడాది జూన్, జూలై నెలలో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి నిండితే, ఆగస్టు నెలలో శ్రీశైలానికి నీరు చేరుతుంది. వచ్చే ఐదు నెలలు ఇప్పుడున్న నీటి నిల్వలతో మంచినీటి సరఫరా చేయడం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలే. తెలంగాణకు కేటాయించిన 31.5 టిఎంసి నీటిలో 31 టిఎంసి నీటిని ఇప్పటికే ఉపయోగించుకుంది. ఆంధ్ర మరో 17 టిఎంసి నీటిని వాడుకునేందుకు అవకాశం ఉందని సాగునీటి ఇంజనీర్లు చెబుతున్నారు. పులిచింతల సామర్థ్యం 45 టిఎంసి. కానీ ఆంధ్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, తెలంగాణకు సకాలంలో నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల నీటి నిల్వ పనులు వాయిదాపడుతున్నాయి. ప్రస్తుతం పులిచింతలలో కేవలం 0.24 టిఎంసి నీరుంది. ప్రస్తుతం జూరాలలో 09.68 టిఎంసికి 0.328 టిఎంసి, శ్రీశైలంలో 215.81 టిఎంసికి 31.35 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 312.05 టిఎంసికి 128.13 టిఎంసి, పులిచింతలలో 45.77 టిఎంసికి 0.24 టిఎంసి నీటి లభ్యత ఉంది.
తెలంగాణను కాపాడిన మిషన్ కాకతీయ
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల 46,531 చెరువుల మరమ్మతుకు నోచుకుంటున్నాయి. దీనివల్ల భూగర్భ జలాల పరిస్ధితి ఆశాజనకంగా ఉంది. గతంలో దుర్భిక్షం బారిన ఉన్న అనేక ప్రాంతాల్లో ఇప్పుడు భూగర్భజలాలు పైకి వచ్చినట్టు భూగర్భ జల శాఖ తాజా నివేదికలో పేర్కొంది. మిషన్ కాకతీయకు మొత్తం రూ.20వేల కోట్లు అంచనా వేయగా, నిరుడు రూ.1500 కోట్లు ఖర్చుపెట్టగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.2193.73 కోట్లు కేటాయించారు.