తెలంగాణ

కెసిఆర్ చదివిన బడికి మహర్దశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, జనవరి 8: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తాను చిన్ననాడు చదువుకున్న బడికి మహర్దశ వచ్చింది. మెదక్ జిల్లా దుబ్బాక బాలుర ఉన్నత పాఠశాలలో కెసిఆర్ 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదివారు. తాను ఆడిపాడి చదవుకున్న బడి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని వానపడితే విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్న విషయం ఎమ్మెల్యే రామలింగారెడ్డి ద్వారా కెసిఆర్ తెలుసుకున్నారు. తాను చదువుకున్న బడి పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సదరు పాఠశాలను దేశంలోనే ఆదర్శంగా నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకొచ్చారు. ఇందుకు అనుగుణంగా విద్యాశాఖ నుంచి ప్రత్యేక నిధుల ద్వారా 4.67 కోట్లు మంజూరు చేశారు. ప్రముఖ ఇంజనీర్లతో బడి నిర్మాణ ప్లాన్లు తయారు చేయించి వాటిలో ఒకదానిని సిఎం కెసిఆర్ స్వయంగా ఎంచుకొని సిద్ధం చేశారు. ఇంద్రభవనాన్ని తలపించేలా అధునాతన సౌకర్యాలతో నిర్మించనున్న ఈ బడిని గెలాక్సీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టు చేజిక్కించుకుంది. ఈనెల 11న ముఖ్యమంత్రి కెసిఆర్ దుబ్బాకలో బడి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మాణానికి చదును చేయడంలో నిమగ్నమయ్యారు. ఏదేమైనా కెసిఆర్ విద్యాబుద్ధులు నేర్చిన గడ్డను మరువకుండా తాను చదివిని బడిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
chitram..
దుబ్బాకలో సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయనున్న బడి నమూనా