ఆంధ్రప్రదేశ్‌

బాబుకు అన్నీతెలుసుట డిపి ఎమ్మెల్యే యరపతినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 5: ‘ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన మాకు మంత్రి కావాలనుంటుంది.. అది తప్పు కాదు.. కానీ మన స్థాయి, అర్హతలు, పార్టీ ఇబ్బందులు, రాజకీయ అవసరాలు, పార్టీ భవిష్యత్తు లక్ష్యాలేమిటో కూడా చూసుకోవాలి కదా? పార్టీ లేకపోతే మనం లేమన్న విషయాన్ని అందరం గుర్తుంచుకుని, పార్టీని ఇబ్బందిపెట్టే ధోరణి మానుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేయడంపై దృష్టి సారిస్తే మంచిది’అని గురజాల టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బాబు, లోకేష్ భుజం తట్టడం ఆనందపరిచిందన్నారు. ఇటీవల పార్టీలో కొందరు నేతల అసంతృప్తిని ఆయన వద్ద ఆంధ్రభూమి ప్రస్తావించగా పార్టీ నేతలు ఒక్కరోజులోనే ఆత్మపరిశీలన చేసుకుని మళ్లీ ఐక్యత ప్రదర్శించటం అభినందనీయమన్నారు. మా పార్టీ ఒక కుటుంబం లాంటిది. కుటుంబసభ్యుల ఆవేదనను మా కుటుంబపెద్ద విన్నారు. వాళ్లు కూడా తృప్తి చెందారు.. అంతే అన్నారు. పార్టీ ఉంటేనే మేమంతా బాగుంటామని, ప్రజలు కూడా అవినీతిపరుడైన జగన్‌ను సీఎం చేస్తే రాష్ట్రం నాశమవుతుందన్న భయంతో, పాలనలో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు పట్టం కట్టారని, అలాంటి బాబు తన ఆశయ సాధన కోసం నిమగ్నమైన సమయంలో ఆయనను ఇబ్బందిపెట్టడం మంచిదికాదని వ్యాఖ్యానించారు. పనిచేసిన వారికి అసంతృప్తి ఉండటం సహజమన్నారు. అసంతృప్తిపరుల ఆవేదనను తాను తప్పుపట్టడం లేదని, అయితే దాన్ని పార్టీ వేదికపై చర్చించాల్సి ఉంటుందన్నారు. నా వరకూ నేను ఎమ్మెల్యే కాకపోతే ఎక్కడో ఉండేవాడిని. నేను ఈ స్థాయికి రావడానికి పార్టీనే కారణం. నా రాజకీయ జీవితం పార్టీ పెట్టిన భిక్ష. నా స్థాయి ఏమిటో నాకు తెలుసు. నాకు పదవి రాలేదని, చివరి నిమిషంలో చేజారిపోయిందన్న బాధేమీ లేదు. మరొకరికి అవకాశాలివ్వాలన్న పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాల్సిన ధర్మం నాకుంది.