ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ బీచ్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 6: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎన్టీఆర్ బీచ్ గురువారం సాయంత్రం మరుభూమిగా మారింది. సముద్ర స్నానం చేస్తూ ముగ్గురు మృతిచెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలల ఉద్ధృతికి తొలుత ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. ప్రాణాలతో బైటపడిన మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్ళరేవు మండలం కాపులపాలెం గ్రామంలోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది గురువారం ఉదయం ఆటోలలో కాండ్రకోట గ్రామంలోని నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. అక్కడినుండి కాకినాడ బీచ్‌కు వచ్చారు. వాకలపూడి వద్ద లోతైన ప్రాంతంలో వీరంతా స్నానం చేస్తుండగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో గల్లంతయ్యారు. కొద్దిసేపటికి పితాని శ్రీను (40), శీలం దేవి (18), పితాని అనిత (16) మృతదేహాలు లభ్యమయ్యాయి. పితాని వంశీ (14), పితాని జయకృష్ణ (18) అనే ఇద్దరు గల్లంతయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన శీలం తణుకులమ్మ (40), శీలం శ్రీను(19), పితాని రమ్య (18)ను కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గల్లంతైన ఇద్దరి కోసం కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. మృతిచెందిన, గల్లంతైన వారిలో ఒకరు మినహా అంతా విద్యార్థులే.
కాగా ప్రమాద సమాచారం అందుకున్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం రవిప్రకాష్ ఘటనాస్థలిని సందర్శించి, గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
కాగా పితాని పద్మ అనే బాధితురాలు ఈ దుర్ఘటనలో తన కుమార్తె, కుమారుడిని కోల్పోయింది. కుమార్తె అనిత మృతదేహం లభ్యంకాగా, కుమారుడు వంశీ గల్లంతయ్యాడు. మరో కుమార్తె రమ్య కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో మృతిచెందిన పితాని శ్రీను పద్మకు వరసకు మరిది అవుతాడు. కళ్లెదురుగా సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని చూసి రక్షించడానికి ప్రయత్నించిన శ్రీను కూడా మృతిచెందాడు. ఈ దుర్ఘటనతో కాకినాడ తీరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుల ఆర్తనాదాలతో బీచ్ పరిసరాలు మార్మోగాయి.

గాలింపు చర్యలకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదేశం
కాకినాడ బీచ్‌లో గల్లంతైన వారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించాలని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు