రాష్ట్రీయం

రౌడీలను రానీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: ‘మీ అభీష్టాన్ని అనుసరించి పాలన సాగిస్తున్నాను. మీరు సుఖ శాంతులతో ఉండటానికి నిరంతరం పనిచేస్తున్నాను. కాబట్టి మళ్లీ నాకు సహకరించాల’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. అనకాపల్లి నూకాలమ్మకు బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందిపెట్టే వారు అధికారంలోకి రాకూడదని అన్నారు. రౌడీలు, దాదాగిరి చేసేవారిని దగ్గరకు రాకుండా ప్రజలు జాగ్రత్తపడాలని సూచించారు. తండ్రిని అడ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టి, వాటికి లెక్కలు చెప్పలేని స్థితిలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడని, ఆర్థిక నేరాలకు పాల్పడిన అటువంటి వ్యక్తిని ప్రజలు దూరంగా ఉంచాలంటూ జగన్‌పై చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించి, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు
రాబట్టాలని చూసే తరుణంలో జగన్ విశాఖలో యాగీ సృష్టించడానికి ప్రయత్నించడం శోచనీయమని చంద్రబాబు అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మను ఓడించి విశాఖ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పొట్టకొట్టిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కష్టపడేతత్వం ఉన్న తనకు ప్రజలు ఏకపక్షంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే కొండనైనా పిండి చేస్తానని చంద్రబాబు చెప్పారు.
న్యాయపరంగా కాపులకు రిజర్వేషన్లు
వెనుకబడిన కులాల రిజర్వేషన్లకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపులకు న్యాయపరంగా రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అగ్రవర్ణాల్లో పేద విద్యార్థులు చదువుకోడానికి విదేశాలకు వెళ్లడానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నానని చెప్పారు. తనకు రాజకీయాలు అక్కర్లేదని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్య శాఖలను ప్రక్షాళన చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. డాక్టర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించకపోతే, ఉద్యోగాల నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఈ రెండు రంగాల్లో క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన ఫలితాలు రాబట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
న్యాయం జరగకపోతే చెప్పండి!
ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌లలో బాధితులకు న్యాయం జరగకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు కొత్త యాప్‌ను తయారు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగలేదనుకునేవారు అక్కడి నుంచే తమ ఫోన్‌లో ఈయాప్ ద్వారా తెలియచేస్తే, కేవలం అరగంటలో తానే స్వయంగా సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు చెప్పారు. ఈ యాప్‌ను ఈనెల 14న ప్రారంభించి వెనువెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలియచేశారు.

చిత్రాలు....నూకాంబిక అమ్మవారికి బంగారు కిరీటం తీసుకెళ్తున్న చంద్రబాబు. బహిరంగ సభలో మాట్లాడుతున్న దృశ్యం