రాష్ట్రీయం

లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి నిలదీశారు. ఈనెల 18న నిర్వహించతలపెట్టిన ‘్ధర్మయుద్ధ బహిరంగ సభ’ పోస్టర్‌ను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. రమణ మాట్లాడుతూ, అసెంబ్లీ వేదికగా వివిధ శాఖల్లో లక్ష ఖాళీలు ఉన్నాయని ప్రకటించిన సిఎం కెసిఆర్ ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నోటిఫికేషన్లు జారీ చేయకుండానే అక్రమ మార్గంలో సిఎంవో కార్యాలయం నుంచే ఉద్యోగాల అమ్మకానికి తెరతీశారని ఆరోపించారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లయినా టిఆర్‌ఎస్ సర్కార్ ఉద్యోగాల భర్తీ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తెలంగాణ జేఏసి నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఓయు విద్యార్థి జేఏసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.