రాష్ట్రీయం

ముగిసిన బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. గోదావరిలో వైభవంగా చక్రతీర్థం నిర్వహించి, యాగశాలలో పూర్ణాహుతి, ధ్వజారోహణం చేసి బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అర్చకులు ప్రకటించారు. గత నెల 29న ప్రారంభమైన రాముల వారి బ్రహ్మోత్సవాలు 14 రోజులు భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడించాయి. ఈ నెల 5న సీతారాముల కల్యాణం, 6న మహా పట్ట్భాషేకం జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ముగింపు రోజు గోదావరి తీరంలోని పునర్వసు మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులు, సుదర్శన చక్రానికి తిరుమంజనం చేశారు. భక్తుల సమక్షంలో గోదావరిలో చక్రతీర్థం కనులపండువగా జరిగింది. సాయంత్రం స్వామివారు శేష వాహనంపై తిరువీధి సేవకు వెళ్లి తిరిగి ఆలయానికి వచ్చాక ధ్వజారోహణం చేశారు. ఈసందర్భంగా ఆచార్య, బ్రహ్మ, రుత్విక్కులు స్వామికి ద్వాదశారాధనలు, ద్వాదశ ప్రదక్షిణలు సమర్పించి శ్రీపుష్పయాగం చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు.

చిత్రం..గోదావరి నదిలో స్వామివారికి చక్రతీర్థం