రాష్ట్రీయం

వేసవిలోనూ విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెచ్1ఎన్1 వైరస్ వల్ల సంభవిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి రోజు రోజుకీ విస్తరిస్తోంది. సాధారణంగా శీతాకాలంలో విస్తరించే స్వైన్‌ఫ్లూ ఇప్పుడు వేసవిలోనూ పంజావిప్పింది. మండు వేసవిలోనూ ఈ వైరస్ బతుకుతుందంటే జన్యుమార్పిడికి లోనవుతుందేమోనని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తగిన పరిశోధనలు చేస్తోంది. హెచ్1ఎన్1 వైరస్ అనుకున్నట్లుగా జన్యుమార్పిడికి లోనైతే మాత్రం స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ శాఖ తాజాగా విడుదల చేసిన స్వైన్ ఫ్లూ బులెటిన్‌లో ఒక్క ఏప్రిల్ 11న సేకరించిన 77 రక్త నమూనాల్లో 11 నమూనాల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీన్ని బట్టి తీవ్ర ఉష్ణోగ్రత ఉన్న వేసవిలో సైతం స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ వ్యాధి తీవ్రత బాగానే కనిపించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న విడుదల చేసిన స్వైన్‌ఫ్లూ సమాచారాన్ని బట్టి 2015 ఆగస్టు 1 నుంచి 2017 ఏప్రిల్ 11 వరకు 9,382 రక్త నమూనాలను పరీక్షించగా వాటిలో 1,343 నమూనాల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 22 మంది చనిపోయినట్లు తేలింది. వ్యాధి తీవ్రత రోజురోజుకీ బలపడుతోందని పరీక్షల్లో నిర్ధారణైతే మాత్రం హెచ్1ఎన్1పై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ కె.మనోహర్ తన అభిప్రాయం వెల్లడించారు.