ఆంధ్రప్రదేశ్‌

భారీగా కలెక్టర్ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 17: జిల్లా కలెక్టర్ల బదిలీలపై గత కొద్ది వారాల నుంచి జరుగుతున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టకేలకు తెరదించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ, మొత్తం 20 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు.
వీరిలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం సీఎంఓలో కార్యదర్శిగా పనిచేస్తున్న పిఎస్ ప్రద్యుమ్న, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన పరిశ్రమల శాఖ డైరక్టర్ కార్తికేయ మిశ్రా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా వ్యవసాయశాఖ డైరక్టర్ కె. ధనుంజయరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా వినయ్‌చంద్, గుంటూరు కలెక్టర్‌గా కోన శశిధర్, కడప కలెక్టర్‌గా వుడా వీసీగా ఉన్న బాబూరావు నాయుడు, కర్నూలుకు సత్యనారాయణ, అనంతపురం కలెక్టర్‌గా వీరపాండ్యన్ నియమితులయ్యారు.
గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్ దండేను గృహనిర్మాణశాఖ ఎండిగా, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ కార్యదర్శిగా రమణ, వ్యవసాయశాఖ కమిషనర్‌గా కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు అహ్మద్, పరిశ్రమలశాఖ కమిషనర్‌గా చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్ధజైన్, స్ర్తిశిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా అరుణ్‌కుమార్‌ను నియమించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా పి. లక్ష్మీ నరసింహం, టూరిజం కార్యదర్శిగా ఎంకె మీనా, సిఎంఒ సెక్రటరీగా ఎం గిరిజా శంకర్ నియమితులయ్యారు.
ఇక ప్రస్తుతం కలెక్టర్లుగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారులకు నేడో, రేపో ఉత్తర్వులు రావచ్చని అధికారవర్గాలు చెప్పాయి. తాజా నియామకాల్లో సమర్థులకు అవకాశాలు దక్కాయంటున్నారు. ముక్కుసూటితనం, నిజాయితీతో పనిచేసే ప్రద్యుమ్న, కార్తికేయ మిశ్రా, ధనుంజయరెడ్డి, లక్ష్మీకాంతం వంటి వారికి సమర్ధతకు తగ్గ పోస్టింగులు ఇచ్చారంటున్నారు. చిత్తూరుకు బదిలీ అయిన ప్రద్యుమ్న టెక్నాలజీలో తన ముద్ర వేయడంతోపాటు చురుకైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. స్ర్తి శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల కార్యదర్శిగా అపర్ణా ఉపాధ్యాయుల, నైపుణ్యాల అభివృద్ధి సంస్థ సిఇఓగా కెవి సత్యనారాయణ నియమితులయ్యారు.