రాష్ట్రీయం

‘సిమెంట్’కు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: సిమెంట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తాపై 70 నుంచి వంద రూపాయల వరకూ పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇది సిమెంట్ కంపెనీలు సృష్టించిన కృత్రిమ కొరతేనని క్రెడాయ్, ట్రెడా, బాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోనియేషన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) నేతలు ఆరోపించారు. సిమెంట్ ఉత్పత్తిదారులు పెంచిన సిమెంట్ ధరలను వెంటనే ఉపసంహరించాలని జెఎసి నేతలు జి రాంరెడ్డి, ఎస్ రాంరెడ్డి, రామకృష్ణారావు, రవీందర్ రావు, ఎస్‌ఎన్ రెడ్డి, మూర్తి, జివి రావు సోమవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. సిమెంట్ ధరల నియంత్రణకు వెంటనే సిమెంట్ కంపెనీల యజమానులతో చర్చించాలని సిఎం కెసిఆర్‌ను కోరారు. త్వరలో సిఎంను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. సిమెంట్ ఉత్పత్తిదారులు తక్కువ మొత్తంలో సిమెంట్ ఉత్పత్తి చేసి కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెరిగేలా చేశాయని విమర్శించారు. 2014 ఆగస్టులోనూ ఈ కంపెనీలు ఇదేవిధంగా వ్యవహారిస్తే తాము సిఎంను కలిసి విన్నవించడంతో, సిఎం చొరవ తీసుకుని ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 210 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తా ధరను 60నుంచి 70 శాతం పెంచారని, ఫలితంగా బస్తా ధర మార్కెట్లో 335 రూపాయలకు చేరిందన్నారు. ఇలా పెట్రోలు, డిజిల్, విద్యుత్ ఇతర పన్నులేవీ పెరగలేదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్ కంపెనీలు 20 వరకు ఉన్నాయని, వీటిలో చాలావరకు హైదరాబాద్ నగర శివారులో ఉన్నాయని, అవి కూడా వంద కిలోమీటర్ల లోపే ఉన్నాయని వివరించారు. తెలంగాణలో ఉండే కంపెనీలకు విద్యుత్ కోత లేదని, అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ధరలు పెంచాయని విమర్శించారు. మన రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాలకు సిమెంట్ ఎగుమతి అవుతుందని, ఆ రాష్ట్రాల్లో మన రాష్ట్రంకంటే తక్కువ ధరకు సిమెంట్ విక్రయం జరుగుతోందని అన్నారు. సిమెంట్ కంపెనీలు ధరలు పెంచేందుకు సరైన కారణమేదీ కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంట్రోలు చేయడం కష్టమేమీ కాదని, ఉన్న పరిస్థితిని వివరించేందుకు ప్రధాని అప్పాయింట్‌మెంట్ తీసుకోనున్నట్టు చెప్పారు. సిమెంట్ కంపెనీలను దారికి తెస్తామన్నారు. సిమెంట్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆలోచన ఏదీ లేదన్నారు. సిమెంట్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చేంతవరకు ఎంత సమయం పడుతుందో తెలియదని, అప్పటి వరకు విక్రయాలను నిలుపుదల చేయలేం కదా అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిమెంట్ ధరలు పెరిగితే గృహా నిర్మాణాలు, విక్రయాలపై ప్రభావం ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.