తెలంగాణ

మిర్చి కొనుగోళ్లు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్‌లో
ప్రతి బుధవారం

ప్రతి శనివారం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు బంద్
ఎనుమాముల మార్కెట్ పాలకవర్గం తాజా నిర్ణయం

వరంగల్, ఏప్రిల్ 18: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో ప్రతి బుధవారం మిర్చి కొనుగోళ్లు నిలిపివేయాలని మార్కెట్ పాలకవర్గం నిర్ణయించింది. అదేవిధంగా ప్రతి శనివారం అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత, మార్కెట్ దిగుబడులు అధికంగా వస్తున్న కారణంగా కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కమిటీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిర్చి విస్తీర్ణం బాగా పెరగడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు ప్రతిరోజు భారీమొత్తంలో మిర్చిపంట అమ్మకానికి వస్తోంది. దీనికితోడు పక్క జిల్లాల నుంచి కూడా మిర్చిరైతులు పంటను ఇక్కడికి విక్రయాల కోసం తీసుకువస్తున్నారు. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో మార్కెట్ యార్డులో పంట భారీగా రావడంతో కొనుగోళ్లు చేయలేక వ్యాపారులు చేతులు ఎత్తివేస్తున్నారు. దాంతో రైతులు ఆందోళనలకు, ధర్నాలకు దిగుతున్నారు. దీనికితోడు మార్కెట్‌కు మిర్చిపంట భారీగా అమ్మకాలకు వస్తుండటంతో కొనుగోలు చేసిన మిర్చిబస్తాలను నిలువ చేసుకునే పరిస్థితి కూడా ఇటు మార్కెట్ యార్డుకు, అటు వ్యాపారులకు లేకుండా పోయింది. మంగళవారం ఏనుమాముల మార్కెట్ యార్డుకు 1.20 బస్తాల మిర్చిపంట అమ్మకానికి రావటంతో అటు వ్యాపారులు, ఇటు మార్కెట్ అధికారులు లావాదేవీల విషయంలో ఆపసోపాలు పడ్డారు. ఇంచుమించి ప్రతిరోజు ఇదే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఈనెల 19నుంచి జూన్ 17వరకు ప్రతి బుధవారం మిర్చి మార్కెట్‌లో విక్రయాలు నిలిపివేస్తూ మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సోమ, మంగళవారాల్లో అమ్మకానికి వచ్చిన మిర్చిపంటను బుధవారం నాటికి మార్కెట్ నుంచి తరలించేలా ఏర్పాట్లకు మార్కెట్ కమిటీ, వ్యాపారులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అదేవిధంగా ఈనెల 22 నుంచి జూన్ 17 వరకు ప్రతి శనివారం ఏనుమాముల మార్కెట్ యార్డులో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేయాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం నిర్ణయించిందని చైర్మన్ ధర్మరాజు తెలిపారు. ఎండతీవ్రతతో కూలీలకు, రైతులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా అమ్మకాలకు వస్తున్న కారణంగా వాటిని మార్కెట్ నుంచి తరలించడంలో జాప్యం ఏర్పడుతోందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బుధవారం ఏనుమాముల మార్కెట్‌లోని మిర్చి యార్డు, శనివారం అన్ని యార్డులు పనిచేయవని తెలిపారు.
మార్కెట్‌కు ఐదురోజులు సెలవు
కాగా ఎనుమాముల మార్కెట్ యార్డులో విక్రయానికి వచ్చిన 1.20 లక్షల బస్తాల మిర్చిపంటను తరలించటంలో ఎదురవుతున్న సమస్యతోపాటు వేసవి ఎండల కారణంగా 19వ తేదీనుంచి 22వ తేదీ వరకు మిర్చి మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ఆదివారం సాధారణ సెలవు కారణంగా మార్కెట్‌లో క్రయవిక్రయాలు తిరిగి 24వ తేదీన ప్రారంభమవుతాయని మార్కెట్ కమిటీ పాలకవర్గం తెలిపింది.
chitram..
ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం భారీగా అమ్మకానికి వచ్చిన మిర్చిపంట