తెలంగాణ

రాజధానిని చుట్టుముట్టిన మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ జిల్లాలన్నీ హైదరాబాద్‌లోనే మకాం వేసినట్టుగా మంత్రులంతా హైదరాబాద్‌ను చుట్టు ముట్టారు. గ్రేటర్ ఎన్నికల కోసం మంత్రులు తమకు కేటాయించిన నియోజక వర్గాల్లో బాధ్యతలు చేపట్టారు. నగరానికి చెందిన మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పద్మారావులతో పాటు మిగిలిన మంత్రులంతా నగరంలోనే మకాం వేసి కార్యకర్తలతో సమావేశాలు, కాలనీల్లో సభలు నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉప్పల్ నియోజక వర్గంలో సమావేశం నిర్వహించారు. కె తారక రామారావు నగరం నలుమూలలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎంపి కవిత, వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ్యులు తమకు కేటాయించిన నియోజక వర్గాలు, డివిజన్లలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈనెలాఖరు నాటికే ఎన్నికలు నిర్వహిస్తారనే ఉద్దేశంతో మంత్రులు రంగంలో దిగారు.
మరో నెల రోజుల పాటు కోర్టు పొడిగించడంతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడానికి, ప్రచారానికి తమకు మరింత సమయం లభించిందని మంత్రులు చెబుతున్నారు. విపక్షాలు ఇంకా మేలుకోక ముందే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఇప్పటికే ఒక విడత విస్తృత ప్రచారం పూర్తి చేసింది. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో స్వయంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించడం పార్టీకి కలిసి వచ్చింది. అధికారంలో వచ్చిన సమయంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిఆర్‌ఎస్ బలం అంతంత మాత్రమే. సికిందరాబాద్, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గాలు రెండింటిలో మాత్రమే టిఆర్‌ఎస్ గెలిచింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ పరిస్థితి మారిపోయింది. కెటిఆర్‌కు గ్రేటర్ ఎన్నికల బాధ్యత అప్పగించారు. ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కెటిఆర్ ఎక్కువగా దృష్టిసారించారు. జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రాంతానికి చెంది హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న వివిధ కులాలకు చెందిన కుల సంఘాల సమావేశాల్లో సైతం కెటిఆర్ పాల్గొంటున్నారు. విభజనతో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణ ఏర్పాటు దీనికి దోహదం చేసిందని ప్రచారంలో కెటిఆర్ వివరిస్తున్నారు. ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో ఉండే వారంతా హైదరాబాదీలేనని, ఎవరి పట్లా ప్రభుత్వం వివక్ష చూపడం లేదని, అందరి కోసం పని చేస్తోందని కెటిఆర్ తన ప్రసంగాల్లో వివరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎక్కువగా ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ జిల్లాలకు చెందిన వారిలో ఒక్కో ప్రాంతంలో ఒక జిల్లా వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో ఆ జిల్లాకు చెందిన మంత్రులు, శాసన సభ్యులు పర్యటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సికిందరాబాద్‌లో మంత్రి టి పద్మారావు శుక్రవారం ఏడు డివిజన్లలో 12 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం ఆదేశించడంతో మంత్రులంతా సమావేశాలు నిర్వహించారు.