రాష్ట్రీయం

శిల్పాకే నంద్యాల టికెట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 20: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై రేగిన వివాదం కొలిక్కి వచ్చినట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండి తీరుతానని మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు భూమా నాగిరెడ్డి హఠార్మరణం నేపధ్యంలో టికెట్ తమ కుటుంబానికే దక్కాలని మంత్రి భూమా అఖిలప్రియ పట్టుదలతో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండోవర్గం నుంచి ఇక్కట్లు తప్పవని గ్రహించిన చంద్రబాబు వారం రోజుల్లో ఈ వివాదానికి తెరదించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శిల్పా సోదరులతో చంద్రబాబు అమరావతిలోని తన కార్యాలయంలో బుధవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ పదవి ఇవ్వజూపినా శిల్వా నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో బాబు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తనపై నమ్మకం ఉంచాలని చెప్పి పంపినట్లు సమాచారం. ఒక దశలో పరోక్షంగా టికెట్ ఇవ్వడం ఖాయమని ఆయన సంకేతమిచ్చారని తెలుస్తోంది. దీంతో సంతృప్తి చెందిన శిల్పా సోదరులు పార్టీ మారాలన్న ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టి నియోజకవర్గంలోని తన కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో నిమగ్నం కావాలని నిర్ణయానికి వచ్చారని టిడిపి జిల్లా నేతల ద్వారా తెలుస్తోంది. కాగా శిల్పాకు టికెట్ కేటాయింపు విషయంలో భూమా వర్గాన్ని బుజ్జగించేందుకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌తో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్నారని ఆ సమయంలో ఎస్వీ, ఫరూక్‌తో మంతనాలు సాగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.
వైకాపా అభ్యర్థి ప్రతాపరెడ్డి?
నంద్యాల ఉప ఎన్నికలో వైకాపా తరఫున అభ్యర్థి పేరు ఖరారైనట్లు సమాచారం. పట్టణంలోని సినీ థియేటర్ల యజమాని ఉలవల ప్రతాపరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించినట్లు వైకాపా ముఖ్యనాయకుల ద్వారా తెలుస్తోంది. టిడిపిని వీడి తమ పార్టీలోకి శిల్పా వస్తారని వేచి చూసిన జగన్ బుధవారం రాత్రి అమరావతిలో జరిగిన పరిణామాలను తెలుసుకున్న అనంతరం ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతాపరెడ్డికి సంకేతాలు పంపారని వారంటున్నారు.

చిత్రం..శిల్పా మోహన్‌రెడ్డి