తెలంగాణ

సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థులు బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సిఎం డౌన్ డౌన్..’ అంటూ కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు, మరికొందరు నిరుద్యోగ జెఎసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన రాష్టప్రతి సభా వేదికకు దూరంగా జరగడంతో విద్యార్థులెవరూ పెద్దగా స్పందించలేదు. నిరుద్యోగ జెఎసి నేత, సామాజిక కార్యకర్త ఇందిరా శోభన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యమిస్తే నాయకులకు అధికారం దక్కిందన్నారు. అలాంటి ఉద్యమకారులను సిఎం కెసిఆర్ విస్మరించారని, విద్యార్థులకు, నిరుద్యోగులకు రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆరోపించారు. విద్యార్థులను విస్మరించే ఏ ప్రభుత్వమైనా ఎక్కువకాలం మనలేదన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నా విద్యార్థుల్లో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్వరాష్ట్రం, స్వపరిపాలన కోసం ఓయూ వేదికగా జరిగిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయిందని, విద్యార్థులు చూపిన పోరాట పటిమ స్వరాష్ట్ర సాధనలో కీలకమైందని, ఓయూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు తీరిపోతాయని విద్యార్థులు ఆశించారు. ఓయూ వేదికగా సిఎం కెసిఆర్ తమకు న్యాయం చేస్తారని విద్యార్థులు భావించారు.

ఉస్మానియాలో సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు