రాష్ట్రీయం

కియాశీలక ఒప్పందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమొబైల్ హబ్‌గా మార్చడానికి చేస్తున్న కృషిలో ‘కియా’ రాక ఒక మేలిమలుపు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా ఇప్పటికే హార్టికల్చర్, డిఫెన్స్-ఏరోస్పేస్ రంగాల్లో ముందడుగు వేసిందని, ఇప్పుడు ఆటోమోటివ్ రంగంలో ప్రధాన కేంద్రంగా నిలవబోతోందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘దేశంలోని ప్రతి పౌరుడికి కనీసం ద్విచక్ర వాహనం, లేదా కారు ఉండాలని నాలుగు రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో టీమిండియా నిర్ణయించింది. ఈ సమయంలో రాష్ట్రానికి కియా రాక సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ-కియా మోటార్స్ కార్పొరేషన్ ఏపీలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుపై గురువారం ఉదయం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. దీనిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి ‘ఇది ఒక చారిత్రక రోజుగా నిలిచిపోతుంద’ని అభివర్ణించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆటోమొబైల్ రంగానిదే కీలక భూమిక అని చెబుతూ, ప్రస్తుతం కార్ల మార్కెట్‌లో ఐదవ స్థానంలో, ద్విచక్ర వాహన మార్కెట్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే ద్వితీయ, ప్రథమ స్థానాల్లోకి రాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగం మనదేశంలో 12.7 శాతం వృద్ధితో ముందుకు వెళుతోందని, ఇది 15 శాతం వరకు పెంచుకునేందుకు తగిన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా ఏపీలో ఆటో కాంపోనెంట్స్ సెక్టారు వేళ్లూనుకుంటోందని, ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి 2015లో ఆటోమొబైల్-ఆటో కాంపోనెంట్స్ పాలసీని తీసుకువచ్చామని గుర్తుచేశారు.
ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగాల్లో 2020 నాటికి మొత్తం 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి ఇసుజు, హీరో మోటోకార్ప్, అశోక్ లేలాండ్, అపోలో టైర్స్, సియట్ టైర్స్, భారత్ ఫోర్జ్, బ్రేక్స్ ఇండియా-టివిఎస్ గ్రూప్, బస్ బిల్డింగ్ యూనిట్-వీర వాహన వంటి సంస్థలు వచ్చాయని అన్నారు.
గ్లోబల్ ఆటోమొబైల్ జెయింట్‌గా ఉన్న కియా మోటార్స్ రాష్ట్రానికి రావడం ఎంతో శుభ సూచకమన్న ముఖ్యమంత్రి-కొరియాలో 1944 నుంచి కార్ల తయారీ రంగంలో ఉన్న ఈ సంస్థ అక్కడ రెండవ అతి పెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిందని చెప్పారు. 3.5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల కియా ఏటా 45 బిలియన్ అమెరికా డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉందని తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఎర్రమంచి గ్రామంలో ఈ సంస్థ రూ.12,900 కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ ప్లాంటును నెలకొల్పడానికి ముందుకొచ్చిందని చెప్పారు. ప్రతి 56 సెకన్లకు ఒక కారును ఉత్పత్తి చేయగల అన్ని సాంకేతిక వనరులు, పరిజ్ఞానం ఉన్న కియా మోటార్స్ ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయదగిన ప్లాంటును ఇక్కడ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రతి నెలా నాలుగో సోమవారం ఈ ప్లాంటు పురోగతిపై సమీక్ష జరుపుతామన్నారు. జిల్లా కలెక్టర్‌ను నోడల్ అధికారిగా నియమిస్తామన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న కియా సంస్థ, ఏపి ప్రభుత్వ ప్రతినిధులు