రాష్ట్రీయం

నేడే బాహు‘్భళి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: అంతుచిక్కని ప్రశ్నకు అసలైన సమాధానం దొరికినపుడు కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ‘ముగింపు’ కథతో ఆ ఆనందాన్ని అందించేందుకు రాజవౌళి పచ్చజెండా ఊపేశాడు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి -ది కన్‌క్లూజన్ సినిమా నేడు విడుదలవుతోంది. ఒక తెలుగు సినిమా విడుదల దేశం మొత్తానికి వార్తాంశంగా మారడం బహుశ ఇదే కావొచ్చు. ఆర్కా మీడియా బ్యానర్‌పై ఐదేళ్ల కష్టానికి ‘ముగింపు’ న్యాయం కోరుతూ సినిమా విడుదలవుతోంది. ‘బిగినింగ్’తోనే ‘బాహుబలి’ అన్న పదాన్ని రికార్డులకే రికార్డుగా మార్చిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళి ‘కన్‌క్లూజన్’లో ప్రేక్షకుల మస్తిష్కాన్ని తొలిచేసిన ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాడు. కథకు సంబంధించిన విషయాన్ని పక్కనపెడితే, సినిమా వ్యాపారాన్ని కొంతపుంతలు తొక్కించి, తెలుగు పరిశ్రమ స్థామినాను ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పగలిగిన ‘బాహుబలి’గా రాజవౌళికి రికార్డు దక్కింది. చిన్న కథకు పెద్ద ఊహ జోడించి -జానపదాన్ని చారిత్రకం చేసిన దర్శకుడిగానూ జక్కన్నకు పాపులార్టీ దక్కింది. భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా, ‘బాహుబలి’ ముందూ వెనుకా మరో ‘బాహుబలి’ లేడన్న రికార్డులు ఈ చిత్రానికే దక్కాయి. ఇన్ని రికార్డుల మధ్య ప్రపంచవ్యాప్తంగా 8500 స్క్రీన్స్ మీద, దేశంలో 6500 స్క్రీన్స్ మీద నేడు బాహుబలి విడుదలవుతోంది. మూవీ ట్రేడ్ విశే్లషకుల లెక్కల ప్రకారం దేశీయ సినిమా వసూళ్ల రికార్డులను దాటేసి మొత్తం వసూళ్లు వెయ్యి కోట్లకు చేరే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో విడుదలవుతున్న ‘బాహుబలి’పై ఉత్కంఠ కనిపిస్తోంది. విడుదలవుతోన్న అన్ని థియేటర్లలో వారంపాటు షోలకు అడ్వా న్స్ బుకింగులు పూర్తయ్యాయంటే బా హుబలిపై కనిపిస్తోన్న ఆసక్తిని అంచనా వేయొచ్చు. కథకుడిగా విజయేంద్రప్రసాద్, నిర్మాతలుగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్‌కుమార్, ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు శిరిల్ లాంటి వాళ్లకు రికార్డులు మిగల్చనున్న బాహుబలి -్భరతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.