రాష్ట్రీయం

ఆంధ్ర, తెలంగాణ మధ్య బదిలీలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి.సింగ్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య బదిలీలపై మార్గదర్శకాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు బదిలీలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని శుక్రవారం ఆయన శాఖాధిపతులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో జరిగే అంతర్గత బదిలీలకు మాత్రం ఈ నిషేధం వర్తించదని సిఎస్ పేర్కొన్నారు. జిల్లా, జోనల్, మళ్టీ జోనల్ కేడర్ కింద ఉమ్మడి రాష్ట్రంలో స్థానికేతరుల కోటా కింద నియమితులైన ఉద్యోగులు రాష్ట్ర విభజన తర్వాత స్థానికత ఆధారంగా తమ సొంత రాష్ట్రానికి పంపించాల్సిందిగా కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. బదిలీలు కోరుకుంటున్న వారిలో ముఖ్యంగా భార్య, భర్తలు ఉద్యోగులైన పక్షంలో స్పౌస్ కేసు కింద బదిలీలు కోరుతున్నారు. అలాగే స్థానిక కోటాలో నియమితులైన ఉద్యోగుల్లో కొందరు స్థానికత ఆధారంగానూ, మరికొందరు పరస్పర అంగీకారం (మ్యుచ్‌వల్) బదిలీలను కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని సిఎస్ తెలిపారు. అయతే ఈ వ్యవ హారంపై ఇరు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన కమిటీ నివేదికను సమర్పించి, మార్గదర్శకాలను వెలువరించే వరకు బదిలీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన సర్క్యూలర్ జారీ చేశారు.