రాష్ట్రీయం

జగన్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అలాగే కుటుంబ సభ్యులతో కలసి న్యూజీలాండ్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంతరెడ్డి కొన్ని నెలల కిందట జగన్‌కు చెందిన టీవీ చానల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూపై సిబిఐ అభ్యంతరం లేవతీసింది. జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్న రమాకాంతరెడ్డితో చేసిన ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఉందని సిబిఐ అభియోగం మోపుతూ జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని మార్చి 28న పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై ఇరుపక్షాల న్యాయవాదులు రెండు దఫాలు వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. దీంతో జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకే కోర్టుకు చేరుకున్నారు. వైకాపా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కోర్టుముందు గుమికూడారు.
జగన్ బెయిల్‌పై సిబిఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ తీర్పు చెబుతూ సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించడం లేదని, పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను జూన్ 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పు జగన్‌కు అనుకూలంగా వెలువడటంతో అప్పటికే కోర్టు ప్రాంగణంలో గుమికూడి ఉన్న వైకాపా కార్యకర్తలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.

చిత్రం..సిబిఐ ప్రత్యేక కోర్టు నుంచి బయటకు వస్తున్న జగన్