రాష్ట్రీయం

ఇదేం శతాబ్ది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల తొలి అంకం శుక్రవారం ముగిసింది. ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంతో ప్రారంభించగా, ముగింపు కార్యక్రమం మాత్రం ఘోరంగా, పేలవంగా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ప్రారంభ కార్యక్రమంలోనే రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతోపాటు సిఎం కె చంద్రశేఖరరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు మాట్లాడాల్సి ఉన్నా, అనూహ్యంగా కార్యక్రమాన్ని 20 నిమిషాలకు ముందే ముగించారు. విద్యార్థుల నిరసనలను దృష్టిలో ఉంచుకునే సిఎం మాట్లాడే సాహసం చేయలేకపోయారనే ఆరోపణలు వినవచ్చాయి. అయితే వైస్ ఛాన్సలర్ దానిని ఖండిస్తూ రాష్టప్రతి భవన్ ఆదేశాల మేరకే ఎవరూ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. దీనిపై పదే పదే విమర్శలు రావడంతో ఆయన మరో మారు శుక్రవారం స్పందిస్తూ రాష్టప్రతి ప్రసంగం సమయంలో ఛాన్స్‌లర్ అయిన గవర్నర్, సిఎం మాట్లాడకపోవడానికి ప్రత్యేక కారణాలు లేవని వివరించారు. షెడ్యూలు ప్రకారమే నిర్వహించామని, ఏం మార్పులు జరగలేదన్నారు. కార్పస్ ఫండ్ ద్వారా ఉస్మానియా యూనివర్శిటీని అభివృద్ధి చేసుకునే వీలుందన్నారు. ఉద్యమం సమయంలో విద్యార్థులు కొంత నష్టపోయిన మాట నిజమేనని , వర్శిటీ ప్రతిష్టను అంతా కలిసి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఓయు ప్రతిష్టను పెంచడంపై అనేక అంశాలను అధ్యయనం చేయాలని, సిబ్బంది కొరత తీర్చాలని, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు అందరూ కలిసి కృషి చేయాలని సదస్సు సందర్భంగా వక్తలు సూచించారని విసి వివరించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 26 మధ్యాహ్నం శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించగా, 28 సాయంత్రం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కార్యక్రమానికి హాజరుకావల్సి ఉన్నా వౌనంగా ఉండిపోయారు. శతాబ్ది ఉత్సవాల అంతర్భాగంగా నిర్వహించిన జాతీయస్థాయి వైస్ ఛాన్సలర్ల సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరుకావల్సి ఉండగా, దానికి సైతం గైర్హాజరయ్యారు. విచిత్రం ఏమంటే వైస్ ఛాన్సలర్ల సదస్సును ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తున్నా, ఆ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన ఒయు విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం సైతం గైర్హాజరయ్యారు. అస్వస్థత కారణంగా విసి రాలేకపోతున్నారని నిర్వాహకులు ప్రకటించి, మాజీ విసి ప్రొఫెసర్ సులేమాన్ సిద్థిఖీకి కార్యక్రమ బాధ్యతలు అప్పగించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడం, నిర్వాహకుల ఒత్తిడి నేపథ్యంలో విసి ప్రొఫెసర్ రామచంద్రం సాయంత్రం సదస్సులో ప్రత్యక్షమయ్యారు. ఒయు శతాబ్ది ఉత్సవాలు అనుకున్న స్థాయిలోనే జరిగాయని, చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని పట్టించుకోవద్దని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు అనేక మంచి సలహాలు ఇచ్చారని, నేటితరం విద్యార్థులకు ఈ ఉత్సవాలు ఎంతో స్ఫూర్తి కలిగిస్తాయన్నారు. నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చంచడం జరిగిందని విసి ప్రొఫెసర్ రామచంద్రం చెప్పారు. తొలి రోజు సమావేశం ఆద్యంతం అద్భుతంగా జరిగిందని, తనకు అండగా ప్రతి ఒక్కరూ పనిచేశారని విసి సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.