రాష్ట్రీయం

నిధులు సమకూరితేనే పునర్వికాసం సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉన్నత విద్యాసంస్థల పునర్వికాసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సిందేనని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (ఎఐయు) సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ ఫుర్కన్ కమర్ పేర్కొన్నారు. ఆంధ్రభూమి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎఐయు అత్యంత పురాతనమైన అతి పెద్ద నెట్‌వర్క్ అని పేర్కొన్నారు. దేశంలో ఉన్నత విద్య విస్తరణకు విద్యాసంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబద్ధతతో సామాజిక కలుపుగోలుతనంలో భాగంగా చదువులను విస్తరించాలంటే సవాళ్లు తప్పడం లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతో భారతీయ సంస్థలు పోటీపడలేకపోవడానికి అనేక కారణాలున్నాయని, దేశంలో 800 విశ్వవిద్యాలయాలు, 40వేల కాలేజీలు పనిచేస్తున్నాయని, ఒక విధంగా చెప్పాలంటే అమెరికా, చైనా తర్వాత మనదే అతి పెద్ద విద్యావ్యవస్థ అని అన్నారు. సమానత్వం, విస్తరణ, ప్రమాణాలను కాపాడే సమర్థత గురించి పట్టించుకున్న రోజు మనం కూడా విదేశీ వర్శిటీలతో పోటీపడగలుగుతామని చెప్పారు. ప్రతి విద్యాసంస్థకు పెద్ద ఎత్తున నిధులను ఇవ్వగలిగినపుడే అవి నిలదొక్కుకుంటాయని, విదేశాల్లో విశ్వవిద్యాలయాలకు లెక్కలేనంత పెద్ద మొత్తంలో నిధులు వస్తుంటాయని అయితే ఇపుడిపుడే దేశంలో విద్యాసంస్థలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరుగుతోందని పేర్కొన్నారు. విద్యాసంస్థలకు స్వేచ్ఛ అనేది ఆయా సంస్థల జవాబుదారీతనం పారదర్శకత ఆధారంగానే ఉండాలే తప్ప, అనవసరపు స్వేచ్ఛ వల్ల విద్యాసంస్థల్లో తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు.