రాష్ట్రీయం

అన్నదాతల దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 1: ప్రభుత్వ విధానాల వల్లే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సమస్యలు నెలకొన్నాయని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. గత వారంరోజులుగా ఖమ్మం మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితిని పరిశీలించేందుకు సోమవారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఖమ్మం మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతోనూ, మార్కెట్ కమిటీతోనూ, ఉద్యోగులతోనూ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ మిర్చిరైతుకు నష్టం జరుగుతున్నదని తెలిసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కనీస గిట్టుబాటుధర కోసం రైతులు ఆందోళన చేస్తుంటే వారిని సంఘ విద్రోహ శక్తులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత శుక్రవారం ఖమ్మం మార్కెట్‌లో జరిగిన సంఘటన దురదృష్టకరమని, ప్రభుత్వ విధానాలపై రైతులు చేసిన ఆందోళనలుగా దీనిని వర్ణించారు. కనీస మద్దతుధర కోసం రైతులు ఉద్యమిస్తుంటే దానిని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా చూస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. ఆందోళనలు చేసిన రైతులను అరెస్టు చేసి జైలుకు పంపడం దురదృష్టకరమని, ఈ సంఘటనపై అసెంబ్లీలో కూడా తమను మాట్లాడనీయకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కొందరు వ్యాపారులు టిఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వర్తకసంఘం స్వచ్ఛంద సంస్థ అని, ఒక పార్టీ అనుచరుల్లా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అరెస్టు చేసిన 11మంది రైతులేనని, వారిపై ఉన్న కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వి హన్మంతరావు, అయితం సత్యం తదితరులు ఉన్నారు.

చిత్రం..ఖమ్మం మార్కెట్‌లో రైతులతో మాట్లాడుతున్న జానారెడ్డి