రాష్ట్రీయం

సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో ఐదుగురు పోలీసు అధికారులపై వేటు పడింది. వీరిని సస్పెండ్ చేస్తూ డిజిపి అనురాగ్ శర్మ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరో నలుగురిపై విచారణ జరపాలని, 16మందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నరుూంతో లింకున్న సిఐడి అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, మీర్‌చౌక్ ఏసిపి మాలినేని శ్రీనివాసరావు, కొత్తగూడెం ఇన్‌స్పెక్టర్ రాంగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్, కొత్తగూడెం సిఐ రాజగోపాల్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా మహబూబ్‌నగర్ డిటిసి సాయిమనోహర్, ఇల్లందు డిఎస్పీ ప్రకాశరావు, జెన్కో డీఎస్పీ వెంకటనర్సయ్య, గద్వాల్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్యపై వౌఖిక విచారణ జరుగనుంది. డిజిపి చర్యలకు ఆదేశించిన 16 మందిలో అదనపు ఎస్పీ చంద్రశేఖర్, సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి, హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. నరుూం ఎన్‌కౌంటర్‌లో హతమై తొమ్మిది నెలలు గడిచాయి. ఇప్పటివరకు 148 మందిని విచారించి 98 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ ఈ కేసులో నామమాత్రంగా ఇద్దరు పోలీస్ అధికారులపై బదిలీ వేటుపడగా, ఒక రాజకీయ నాయకుడిపై కేసు నమోదైంది. హత్య లు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడిన కొందరు రిమాండ్‌లో ఉన్నారు.