రాష్ట్రీయం

నిషిత్ అంత్యక్రియలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 11: హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ్ అంత్యక్రియలు మంత్రి స్వస్థలమైన నెల్లూరు నగరంలో గురువారం నిర్వహించారు. నారాయణ మెడికల్ విద్యాసంస్థల ప్రాంగణంలోని ఆయన ఇంటి వద్ద నిషిత్ మృతదేహాన్ని సందర్శనార్ధం గురువారం ఉదయం 10 గంటల వరకు ఉంచారు. అనంతరం నిషిత్ అంతిమయాత్ర నగర వీధుల గుండా భారీ జనసందోహం నడుమ పెన్నాతీరం వరకు సాగింది. పెన్నానదీ తీరాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్మశాన స్థలి వద్ద మంత్రి నారాయణ తన కుమారుడు నిషిత్ చితికి నిప్పంటించారు.
ఏ తండ్రికీ ఈ పరిస్థితి రాకూడదు..
కుమారుడి మృతి సంఘటన మంత్రికి తెలిసేటప్పటికి ఆయన లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనకు చేరవేసేందుకు కుటుంబసభ్యులు, అధికారులు ఎన్నో సార్లు ప్రయత్నించారు. చివరకు ఘటన జరిగిన రెండు గంటల తర్వాత మంత్రికి విషయం తెలిసి అక్కడ్నుంచి హుటాహుటిన నెల్లూరుకు బయల్దేరారు.
గురువారం తెల్లవారుజామున చెన్నైకు చేరుకున్న ఆయన వేకువజామున 3 గంటలకు ఇంటికి చేరుకొని కుమారుడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఆయన్ను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. తనకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటాడనుకుని ఆశలు పెంచుకున్న కుమారుడు తన కళ్లెదుట అచేతనంగా పడిపోయి ఉండడంతో ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోలేని ఆయన ఇంట్లోకి వెళ్లి పడిపోయారు. ఆ సమయంలో ఆయన దగ్గరున్న సన్నిహితులతో ‘ఏ తండ్రికీ ఇటువంటి పరిస్థితి రాకూడదు..’ అంటూ బిగ్గరగా ఏడ్చారు.
రాత్రి నుండి నెల్లూరులో మంత్రివర్గం
రాష్ట్ర మంత్రి వర్గ సహచరులంతా బుధవారం రాత్రి నెల్లూరుకు వచ్చి నారాయణ కుటుంబసభ్యులను ఓదార్చడంతో పాటు నారాయణ వచ్చే వరకూ అక్కడే రాత్రంతా గడిపారు. ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ అన్నీ తానై ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫోన్ ద్వారా నారాయణను పరామర్శించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అధికారుల బృందం నిషిత్ మృతదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళుర్పించారు. నివాళులర్పించిన నారా లోకేష్ మాట్లాడుతూ నారాయణ కుటుంబసభ్యులతో తనకు 1999 నుండి పరిచయం ఉందని, అప్పట్నుంచి తాను తరచూ కలుస్తుండేవాడినని, ఆ సమయంలో నిషిత్ చిన్న పిల్లవాడన్నారు.
అతని ప్రతి ఎదుగుదల తాను చూశానని, నారాయణ విద్యాసంస్థల డైరక్టర్‌గా ప్రతిభ కనబరుస్తూ ముందుకెళ్లే సమయంలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటన తనను కలచివేసిందన్నారు. నారాయణను పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, శిద్దా రాఘవరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్‌బాబు, నక్కా ఆనంద్‌బాబు,కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలువ శ్రీనివాసులు, మాణిక్యాలరావు, కిమిడి కళావెంకటరావు, మండలి చైర్మన్ చక్రపాణి, రాజ్యసభ సభ్యుడు సి ఎం రమేష్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, డిజిపి సాంబశివరావు, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.

చిత్రం.. నెల్లూరు పెన్నా తీరంలో తనయుడి చితికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న మంత్రి నారాయణ