రాష్ట్రీయం

చేయాల్సింది ఎంతో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: మూడేళ్లుగా మిగులు బడ్జెట్‌తోనూ, ఈ ఏడాది నగదు రహిత చెల్లింపులతో దూసుకుపోతున్న తెలంగాణలో సామాజిక అభివృద్ధి ఎంత? అంటే వంద ప్రశ్నలు తలెత్తే పరిస్థితి. చేసింది ఎంతో ఉందని చెప్పుకుంటున్నా, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ సంస్థ రూపొందించిన నివేదికను పరిశీలిస్తే చేయాల్సింది ఎంతో ఉందన్న విషయం అర్థమవుతోంది. రాష్ట్ర స్థితిగతులు, సామాజిక అభివృద్ధిలో వెనుకబాటు తనాన్ని సూచిస్తూ, ఆ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ఏయే అంశాలపై దృష్టి సారించాల్సి ఉందో సూచనలతో కూడిన నివేదికను పొందుపర్చింది. నగరాలు, పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో నివేదికలో సమగ్రంగా వివరించటం గమనార్హం. వృద్ధులు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాలు తదితర అంశాలపై కూలంకషంగా లోతైన అధ్యయనాన్ని నివేదికలో పొందుపర్చారు. నివేదికను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్ధ (ఎంసిఆర్- హెచ్‌ఆర్‌డి)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. 238 పేజీలతో రూపొందించిన నివేదికలో 2011-14 వరకు చేపట్టిన సర్వేలలోని సమాచారం ఆధారంగా ప్రభుత్వం అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశాలనూ సూచించింది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధంచి 70 ఏళ్లయినా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సరైన తాగునీటి వసతి లేదని పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లా మరీ వెనుకబడి ఉందని, తాగు నీటి సదుపాయం లేనివాళ్లలో ఎస్టీల ప్రథమస్థానంలో, ఎస్టీలు రెండోస్థానంలో ఉన్నట్టు పేర్కొంది. జాతీయస్థాయి సగటుకంటే కూడా దయనీయ పరిస్థితి ఎక్కువగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో 18 శాతం మంది తాగు నీటి కోసం వాటర్ బాటిళ్లపై ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల మురికివాడలపై వెంటనే దృష్టి సారించాల్సిందిగా నివేదికలో అభివృద్ధి మండలి సూచించింది.
సర్వే ప్రకారం 14 శాతం మంది బడి బయటే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 1.3 శాతం మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 37 శాతం మంది బడి బయటే ఉన్నారు. బడిలో చేరిన వారిలో నాలుగింట మూడొంతుల మంది మాత్రమే చదువు పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు పూర్తి చేసిన వారి సంఖ్య మరీ తక్కువ. స్పెషలైజేషన్ వారీ చూస్తే సామాజిక శాస్త్రాలు చదివిన వారు మెదక్ జిల్లాలో ఎక్కువ. ఇక గృహాల్లో కంప్యూటర్లు ఉన్నది కేవలం 10 శాతమే.
పక్కా ఇళ్ళు లేవు
79.6 శాతం ఎస్సీ కుటుంబాలకు పక్కా ఇళ్ళు లేవని తేలింది. 29 శాతం గృహస్థులకు చెత్త వేసే సౌకర్యం లేదని, 37 శాతం మంది తమ సొంత ఏర్పాట్లు చేసుకున్నారని పేర్కొంది.
విద్యుత్తు సరఫరా భేష్..
ఇక రాష్ట్రంలో విద్యుత్ సరఫరా భేష్‌గా ఉన్నట్లు నివేదిక తేల్చింది. అన్ని జిల్లాలకంటే వెనుక ఉన్న మెదక్ జిల్లాలో విద్యుత్తు సరఫరా 97 శాతం ఉన్నట్టు తెలిపింది.
90 శాతం అప్పుల పాలైన వారే..
తెలంగాణలో అన్ని సామాజిక వర్గాల్లో 90 శాతం మంది అప్పుల పాలయ్యారని నివేదికలో తేట తెల్లమైంది. నగరాల్లో, గ్రామాల్లో అప్పు తీసుకునే వారిలో ఎస్సీ, ఎస్టీల్లో అత్యధికంగా ఇంటి ఖర్చుల కోసమే తీసుకుంటున్నట్టు తెలిపింది. గ్రామాల్లో అత్యధికంగా ఎస్సీలకు, నగరాల్లో అత్యధికంగా ఎస్టీలకు బ్యాంకు ఖాతాలు లేవని పేర్కొంది. ప్రజల్లో సగంమందికి పైగా రుణావసరాలకు ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడుతున్నట్టు తెలిపింది. ఎస్సీలకు భూమి అందుబాటులో ఉండడం లేదని, ఎస్సీలకు కౌలుకి ఇచ్చే భూములు స్వల్పంగా ఉన్నట్టు పేర్కొంది.
వైద్య, ఆరోగ్యంలో ముందడుగు
వైద్య, ఆరోగ్యంలో జాతీయస్థాయితో పోలిస్తే తెలంగాణ ముందున్నట్టు పేర్కొంది. కాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాల్సి ఉందని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోగగ్రస్థులయ్యే వారు ఎక్కువగా ఉన్నారని, గ్రామాల్లో వైద్యానికయ్యే ఖర్చు జాతీయస్థాయి సగటు కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. గ్రామాల్లో రోగాలబారిన పడే వారు ఎక్కువ కావడం, ప్రైవేటు ఆసుపత్రుల మీద ఆధారపడడం ఆందోళన కలిగిస్తోందని నివేదికలో పేర్కొంది.
ఉపాధి విషయంలో..
యువత, నిరక్షరాస్యులకు ఉద్యోగం, జీవనోపాధి లభించేలా వృత్తి నైపుణ్యం పెంచుతూ శిక్షణ ఇవ్వాల్సి ఉన్నట్టు సూచించింది. రాష్ట్రంలో ఐదింట నాలుగొంతుల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం కార్డుల్లో 84.2 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికి ఇచ్చే కార్డులేనని తెలిపింది. మొత్తం కార్డుల్లో 2.7 శాతం కార్డులు అంత్యోదయ కార్డులేనని, ఇవి నగరాలకంటే గ్రామాల్లోనే అధికంగా ఉన్నట్టు వివరించింది.
ఆడ- మగ శిశువుల నిష్పత్తి
ఆడ శిశువుల జననం రేటు తగ్గిపోతోందని, ఆడ శిశువులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని సూచించింది. వృద్ధుల సామాజిక భద్రతకు వ్యవస్థ ఏర్పాటు అవశ్యమని తెలిపింది. నగరాల్లో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన అవశ్యకత ఉందని, తెలంగాణలో పట్టణాలు శరవేగంతో పెరిగాయని, అంతకుముందు 88 పట్టణాలు ఉండేవని, అవి ఇప్పుడు 158కి పెరిగాయని, పట్టణాలు 93 శాతం పెరిగాయని, జనాభాల్లో 30 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని, అత్యధికంగా మురికివాడలు గల నగరంగా హైదరాబాద్ గుర్తింపబడిందని నివేదికలో వెల్లడైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 18 ఏళ్ళు నిండకుండానే బాలికలకు వివాహాలు చేస్తున్నట్టు పేర్కొంది.