రాష్ట్రీయం

7 జిల్లాల్లో ఎండల తీవ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 13: వాయువ్య గాలుల ప్రభావంతో వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అనూహ్యరీతిలో పెరగనున్న ఉష్ణోగ్రతలతో ఆదివారం నుంచి ఈనెల 18 తేదీ వరకు ఎండలు ముదిరి ‘మంటలు’ చెలరేగనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ తెలిపింది. రానున్న నాలుగైదు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగనున్నాయంటూ ఇస్రో హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ సూచించింది.