రాష్ట్రీయం

మిషన్ భగీరథ పనులకు కాంట్రాక్టర్ల కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనుల పురోగతికి కాంట్రాక్టర్ల కరువొచ్చింది. ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ పథకంలోని ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాలకు ఒక్కో ట్యాంకును ఒక్కో ప్యాకేజిగా చేసి 600 ట్యాంకుల నిర్మాణాలకు గత ఏప్రిల్ 8 నుండి నామినేషన్ పద్ధతిలో టెండర్లు పిలిచారు. అయితే నేటికి కేవలం 210 పనులకు మాత్రమే టెండర్లు రావడంతో డిసెంబర్‌కల్లా మిషన్ భగీరథ పనులు పూర్తిచేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.
730 కోట్ల విలువైన ట్యాంకుల నిర్మాణ పనులకు నామినేషన్ టెండర్లు స్వీకరించేందుకు జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఒహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణానికి కాంట్రాక్టర్ల కొరత ఏర్పడింది. 10 వేల నుండి 2 లక్షల లీటర్ల సామర్ధ్యం వరకు ఒహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించాల్సివుంది. 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు టెండర్లు ఉన్నాయి. నెల రోజుల నుండి సగం పనులకు కూడా టెండర్లు రాకపోవడంతో పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గడువులోగా పనులు కావాలంటే కాంట్రాక్టర్లు ఎక్కడి వారైనా పనులు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి నెలకొందని ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామాల్లోకి మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్లు, ఇంట్రావిలేజ్ పనులు చకచగా సాగుతుండగా అందుకు తగ్గట్లుగా ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం జరుగాల్సివుంది.
లేనట్లయితే డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరడం కష్టసాధ్యమేనంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 3 వేల జనావాసాలకు సురక్షిత తాగునీరందించేందుకు 4040 కోట్లతో మిఊన్ భగీరథ పనులు చేపట్టారు. ఇందులో సాగర్ టెయిల్‌పాండ్ పనులు అధిక శాతం పూర్తవ్వగా ఎకెబిఆర్-ఉదయసముద్రం విభాగంలో పనులు కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఒహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాలు కూడా ఆలస్యమైతే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.