రాష్ట్రీయం

విశాఖ స్కాంలో పార్టీల హవాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
అమరావతి, మే 14: రాష్ట్రాన్ని విస్మయపర్చిన వందల కోట్ల రూపాయల విశాఖ హవాలా కుంభకోణంలో బిత్తరపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో ముద్దాయి మహేష్‌కు అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ప్రముఖుల దన్ను ఉన్నట్లు తెలుస్తోంది. సొంత సామాజిక వర్గం దన్ను ఉండటం వల్లే ముద్దాయి తన హవా చలాయించాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో కొందరు మంత్రుల పాత్ర కూడా ఉందని, మహేష్ కంపెనీలో వారు పెట్టుబడులు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో మంత్రి సోదరుడు మహేష్ కబ్జాలకు సహకరించాడని, ఆయన సహకారంతోనే రెండెకరాల స్థలాన్ని అతను స్వాధీనం చేసుకోగలిగాడని చెబుతున్నారు. శ్రీకాకుళం కేంద్రంగా జరిగిన సుమారు రూ.1500 కోట్ల హవాలా కుంభకోణం అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ ప్రముఖుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ముద్దాయి వడ్డి మహేష్ అతి తక్కువకాలంలోనే వందల కోట్లకు పడగలెత్తేందుకు రెండు పార్టీల అగ్రనేతలు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాను శాసించిన ఇద్దరు సోదరులు, విజయనగరం జిల్లా కేంద్రంగా విశాఖ జిల్లాను శాసించిన నాటి మాజీ మంత్రి ఈ వ్యవహారంలో మహేష్‌కు దన్నుగా నిలిచినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఓ సామాజిక వర్గానికి ప్రతినిధిగా వ్యవహరించే విజయనగరం జిల్లా ప్రముఖుడి దన్ను అప్పట్లో ముద్దాయికి ఎక్కువగా ఉండేదంటున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ప్రముఖులు వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు విశాఖకు చెందిన మార్వాడీ ప్రముఖులు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారని, వారి ద్వారానే ముంబయి హవాలా సంబంధాలు బలపడ్డాయని చెబుతున్నారు. అటు అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు కూడా మహేష్‌తో సత్సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో మహేష్ వ్యవహారాలను అడ్డుకున్న ఓ టిడిపి ప్రముఖుడు, తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రి అయిన వెంటనే మహేష్ కార్యకలాపాలను జిల్లా మైనింగ్ ఉన్నతాధికారి ద్వారా నిరోధించారని చెబుతున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయింది. మంత్రి సోదరుడి ద్వారా మహేష్ ఆయనకు సన్నిహితుడై భూమి స్వాధీనం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముద్దాయి తండ్రి శ్రీనివాసరావుతో సదరు మంత్రికి సత్సంబంధాలున్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అంగబలం, అర్థబలం దండిగా ఉన్న మరో మంత్రి, ఆయన వర్గీయుడిగా పేరున్న ఒక ఎంపి కూడా మహేష్‌తో సన్నిహితంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తన పెట్టుబడులు మహేష్ కంపెనీలో పెట్టారంటున్నారు. అసలు ఈ వ్యవహారంలో టిడిపి, వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఒక సామాజిక వర్గం నాయకుల ప్రోత్సాహం మొదటి నుంచీ ముద్దాయికి ఉందనేప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా ‘ఈ వ్యవహారంలో అందరి పేర్లూ వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో తేల్చేందుకు సిబిఐ విచారణ జరిపించాలి. మహేష్ అనే అతను వ్యాపారి కాబట్టి సహజంగా పొలిటికల్ లింకులు కలుపుతున్నారన్నది నా అభిప్రాయం. ఇందులో నిజానిజాలు తేల్చాలంటే సిబిఐ విచారణే సరైనది’ అని అన్నారు.

చిత్రాలు..రాజేష్, హరీష్