రాష్ట్రీయం

13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 15: నగరాలు, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. మార్చి నెలాఖరున నిలిచిపోయిన 13వ ఆర్ధిక సంఘం నిధులను వినియోగించుకుని పట్టణాలు, పల్లెలను అభివృద్ధి చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఈ నిధుల వినియోగానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గడువు పెంచుతూ ప్రభుత్వం సర్కులర్‌ను జారీ సింది. 13వ ఆర్ధిక సంఘం నిధులను మార్చిలోగా ఖర్చు చెయ్యాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి మాసంలోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ చాలా పురపాలక సంఘాలు, పంచాయితీల్లో నిధుల వినియోగం పూర్తికాలేదు. ఇదే సమయంలో మరోపక్క రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పూర్తిగా పనులు నిలిచిపోయాయి. మార్చి నెలాఖరుకు కొద్ది రోజుల్లో గడువు ముగుస్తుండటంతో ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో అప్పటి నుంచి అభివృద్ది పనులు చేయడానికి కమిషనర్లు, కార్యదర్శులు పరుగుతీశారు. అప్పటికే ప్రారంభించిన పనులకు అతీగతీలేకపోవడంతో ఉన్న వాటిని మార్చి నెలాఖరు వరకు పూర్తిచేసి ఆయా జిల్లాల్లోని పే అండ్ అకౌంట్స్‌కు పంపించారు. ఆ బిల్లులను మొత్తం మీద కాంట్రాక్టర్లకు జమచేశారు. మరి కొన్ని పనులకు నిధులు జమచెయ్యాల్సి వుంది. అయితే మార్చి ముగిసి మూడు మాసాలు కావస్తోంది. ఇప్పుడు సెప్టెంబర్ వరకు గడువు పొడిగించినట్టు సర్కులర్‌నుఇవ్వడం విశేషం. ఈ గడువుకు ఇంకా కేవలం నాలుగు మాసాలే ఉండటంతో అటు మున్సిపాల్టీల్లోకాని ఇటు పంచాయతీల్లోగాని టెండర్లు ప్రక్రియ పూర్తికావడానికి మూడు మాసాలు సమయం పడుతోంది. అంతేకాకుండ మరోపక్క టెండర్లు పూర్తి చేసుకుని పనులు ప్రారంభించేనాటికి వర్షాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో పనులు చెయ్యడం అసాధ్యమని చెప్పవచ్చు. దీంతో 13వ ఆర్ధిక సంఘం పనులకు పుణ్యకాలం కాస్తా అయ్యిపోతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద 13వ ఆర్ధిక సంఘం నిధులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంపై అటు పంచాయతీలు ఇటు పురపాలక సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.