రాష్ట్రీయం

సింగపూర్‌లా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: సింగపూర్ ప్రభుత్వంతో కలిసి అమరావతిని ప్రజా రాజధానిగా మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి.. సింగపూర్‌లా ఉండాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కన్సార్టియంతో విజయవాడలో సోమవారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా 33వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సమీకరించామని తెలిపారు. 2014లో మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ముందుకొచ్చిందని, ఆరునెలల వ్యవధిలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు. సింగపూర్ నుంచి ఇంతమంది ప్రతినిధులతో కూడిన బృందం ఇక్కడకు రావడం ఏపి పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. నూతన రాజధాని సింగపూర్‌లా ఉండాలని మొదటి నుంచి తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఏపికి సింగపూర్‌కి ఎన్నో సారూప్యతలున్నాయన్నారు. సింగపూర్ అవినీతి మచ్చ లేని దేశమని తెలిపారు. రాజధాని అమరావతికి కృష్ణానది అదనపు బలమన్నారు. కృష్ణానదికి ఇరువైపులా 30నుంచి 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి జరుగుతుందన్నారు. సింగపూర్ కన్సార్టియం రూపొందించిన మూడు దశల స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్లాన్ తమకు కలిసి వస్తుందన్నారు. అందరూ రాజధాని నిర్మాణం అసాధ్యమని అన్నారని గుర్తుచేశారు. ఆరంభంలో కొన్ని చిక్కులు ఎదురైనప్పటికీ అన్నిటిని అధిగమించి స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నామని తెలియజేశారు. రానున్న రెండేళ్లలో మీ సామర్థ్యం చూపించాలంటూ సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులను కోరారు. ఉద్యోగాల సృష్టి, సంపద సృష్టి జరిపే రాజధాని కావాలని, కేవలం ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగానే కాకుండా క్రియాశీల ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వౌలిక సదుపాయాలు, జీవన యోగ్య వసతులు కలిగిన నగరంగా నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ మూడు దశల్లో రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ అందజేశామని తెలిపారు. అమరావతిని ప్రజా రాజధానిగా మార్చడంలో సిఎం దార్శనికత అద్భుతమని కొనియాడారు. కృష్ణానది దక్షిణ ప్రాంతంలో 6.4కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2018లో సింగపూర్ ప్రధాని భారత్ పర్యటనకు రానున్నారని, ఆ సమయంలో అమరావతిని సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈశ్వరన్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, సింగపూర్‌కి చెందిన 59 మంది పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.
సారధులుగా చంద్రబాబు, ఈశ్వరన్
స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సారధులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ తొలి సమావేశం సోమవారం జరిగింది. ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకు సమావేశం కానుంది. ప్రతి రెండు నెలలకు అధికారుల కమిటీ భేటీ కానుంది. ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా మెకన్సీ సంస్థ వ్యవహరిస్తున్నదని, పాలనా నగర రూపకర్తగా నార్మన్ ఫోస్టర్ వ్యవహరిస్తుండగా బ్లూ, గ్రీన్ కన్సల్టెంట్లను కూడా నియమించినట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ అయిన వెంటనే వీలైనంత త్వరగా ప్రాథమిక దశలను పూర్తిచేసి కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. జాయింట్ స్టీరింగ్ కమిటీలో ఏపి తరపున సిఎంతో పాటు మరో నలుగురు అధికారులు, ఆర్థికమంత్రి, పురపాలకశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వౌలిక వసతుల కల్పనాశాఖ కార్యదర్శి ఉంటారు. సింగపూర్ తరపున ఈశ్వరన్‌తో పాటు కూడా మరో నలుగురు ఉంటారు.

చిత్రం..ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్