రాష్ట్రీయం

జనవరి టు డిసెంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు కొనసాగే ప్రస్తుత విధానానికి స్వస్తి పలకాలని సిఎం కె చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. క్యాలండర్ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్టుగానే ఆర్థిక సంవత్సరం లెక్కించడంలోనూ అదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధానాన్ని కేంద్రం ప్రతిపాదిస్తుండగా, దానికి అనుగుణంగానే రాష్ట్రంలోనూ ఆర్థిక సంవత్సరాన్ని మార్చుకోవాలని సిఎం నిర్ణయించారు. ఈ విధానం ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మొదటి నుంచీ కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో మార్పు చేయడంవల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా అధిగమించిందో అధ్యయనం చేయాల్సిందిగా ఆర్థికశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం మార్పుపై ప్రగతి భవన్‌లో మంగళవారం మంత్రి ఈటల రాజేందర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్ తదితర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరం మార్చే విధానాన్ని అధ్యయనం చేయడానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో అధికారుల బృందాన్ని మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సిందిగా సిఎం కెసిఆర్ ఆదేశించారు.