తెలంగాణ

రాష్ట్రానికి సిస్కో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్‌కు సహకారం

సిలికాన్ వ్యాలీలో మంత్రి కెటిఆర్‌కు చైర్మన్ హామీ

హైదరాబాద్, మే 26: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు సిస్కో ఆసక్తి చూపిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు తెలిపారు. సిలికాన్ వ్యాలీలో సిస్కో కార్యాలయంలో శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ జాన్ చేంబర్స్‌తో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు.
ప్రపంచం డిజిటలైజేషన్ దిశగా సాగుతోందని, డిజిటల్ తెలంగాణ విషయంలో సిస్కో కంపెనీకున్న ఆలోచనలను ఆయన మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా డిజిటల్ తెలంగాణ సాధ్యవౌతుందన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, గ్రామీణ సమాజంలో సమూలమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. అలాగే ప్రభుత్వాలు నిర్వహించే ఫౌర సేవలలో గణనీయమైన మార్పు వస్తుందన్నారు. వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా వైద్య, విద్యా రంగాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. తెలంగాణలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్ వర్క్ ఏర్పాటుకు సిస్కో నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని సిస్కో చైర్మన్ హామీ ఇచ్చారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా కంపెనీ ఇండియా ప్రతినిధులను చర్చలు జరుపాల్సిందిగా ఆయన ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్‌లోని స్టార్ట్ అప్స్, హైదరాబాద్ ఎంటర్ ప్రెన్యూర్స్‌తో తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం సిస్కో సొల్యూషన్స్ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని ఆయన మంత్రిని కోరారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. డిజిటల్ వౌలిక వసతుల రంగంలో ఫైబర్ గ్రిడ్ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. సిస్కో కంపెనీ తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కోరారు.

chitram...
సిలికాన్ వ్యాలీలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కెటిఆర్