రాష్ట్రీయం

వైద్యులు సేవాదృక్పథంతో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: వైద్యులు సేవాదృక్పథంతో పని చేయాలని కేం ద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణ భారతి ట్రస్టు ఆదివారం ఏర్పా టు చేసిన మెగా వైద్య శిబిరాన్ని వెంక్య్య నాయుడు ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సేవాధృక్ఫథంతోనే రోగులకు సేవలందించాలని అన్నారు. పేదలకు స్టంట్ వేయాల్సిన అవసరం వస్తే వారికి ఆ పరికరం ధరను 85 శాతం ప్రభుత్వం తగ్గించి ఇస్తున్నదని ఆయ న గుర్తు చేశారు. విద్య, వైద్య రంగాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన తెలిపారు. వైద్యులు, నర్సుల సంఖ్య అవసరమైనంత లేదని అన్నారు. అందుకే ప్రైవేటు ఆసుపత్రులను, ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 187 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని,జిల్లా కేంద్రాల్లో వీటిని నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు. ఆరోగ్య బీమా తప్పని సరిగా చేయించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజలందరికీ ఇన్సూరెన్స్ చేయించే దిశగా ప్రధాని ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఎంఎన్‌ఆర్ కళాశాలకు చెందిన వై. రాజు, డాక్టర్ కెఎ గోపిచంద్, స్వర్ణ భారతి ట్రస్టుకు చెందిన రవి, సుబ్బారావు పాల్గొన్నారు.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన
విద్యార్థులకు అభినందన
ఇలాఉండగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఎపి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులను కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అభినందించారు. స్వర్ణ భారతి తరఫున వారికి మూడు లక్షల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. సాహస యాత్ర చేసిన ఈ విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు.

మెగా వైద్య శిబిరంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు